Begin typing your search above and press return to search.
స్టోరీ డిస్కషన్స్ అంటూ ప్రొడ్యూసర్ కి 28 లక్షలు బిల్ పెట్టిన రైటర్...!
By: Tupaki Desk | 10 Oct 2020 5:30 PM GMTసినిమా స్టోరీ డిస్కషన్ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం రైటర్స్ - డైరెక్టర్స్ - మ్యూజిక్ డైరెక్టర్స్ మలేసియా బ్యాంకాక్ లకు లేదా మరేదైనా ఫారిన్ కంట్రీస్ కి వెళ్తుంటారు. మరి వాళ్లకు సొంత గూటి నుంచి బయటకు వెళ్తేనే కొత్త ఐడియాలు వస్తాయేమో తెలియదు కానీ.. మన టాలీవుడ్ ప్రముఖులు కూడా డిస్కషన్స్ కోసం అవుట్ స్టేషన్స్ కి వెళ్తారు. అదే ఇండియాలో అయితే ఎక్కువగా గోవా ప్రాంతాన్ని స్టోరీ డిస్కషన్ కోసం ఎంచుకుంటారు. అయితే స్టోరీ సిట్టింగ్స్ కోసం రచయితలు దర్శకుల ఖర్చు నిర్మాతలు భరిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ రైటర్ సినిమా స్టోరీ రాయడానికని గోవా వెళ్లి.. ప్రొడ్యూసర్ తో భారీగా ఖర్చు పెట్టించాడని తెలుస్తోంది.
తెలుగులో పెద్ద ప్రొడక్షన్ హౌస్ వారు నిర్మించే సినిమా కోసం స్టోరీ అందించిన ఓ యువ రచయిత ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. డైరెక్టర్ - రైటర్ కి మధ్య మంచి ర్యాపో కుదరడంతో అదే బ్యానర్ లో మరికొన్ని సినిమాలు చేయాలని సదరు ప్రొడ్యూసర్ లాక్ చేశాడు. ఈ క్రమంలో వీరి కాంబినేషన్ లో ఒక హిట్ ఒక ప్లాప్ వచ్చాయి. ఇప్పుడు ఆ బ్యానర్ లో ఓ స్టార్ హీరోతో ప్రాజెక్ట్ సెట్ అవడంతో స్టోరీ సిట్టింగ్స్ కోసం సదరు రైటర్ ని గోవా పంపించారట. అయితే గోవాలో స్టోరీ రాయడానికి వెళ్లిన రచయిత 28 పేజీల స్క్రిప్ట్ రాసి.. 28 లక్షలు హోటల్ బిల్ పెట్టారట. బిల్ చూసి షాక్ తిన్న ప్రొడ్యూసర్ అక్కడి నుండి వచ్చేయమని.. స్టోరీ మొత్తం రాసుకొని తన కాంపౌండ్ లో అడుగుపెట్టమని టీమ్ ని ఆదేశించాడట.