Begin typing your search above and press return to search.
నిర్మాత వారసుడు `మనుచరిత్ర` ఎంతవరకూ..!
By: Tupaki Desk | 7 Feb 2021 8:15 AM GMT`పెళ్లి చూపులు` చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు నిర్మాత రాజ్ కందుకూరి. `బొమ్మరిల్లు` దిల్ రాజులా ఆయన పేరు తెలుగు ఫిలింసర్కిల్స్ లో అప్పట్లో మార్మోగింది. ఆ తర్వాత తనయుడు శివ కందుకూరిని చూసి చూడంగానే అనే ప్రేమకథా చిత్రంతో హీరోగా పరిచయం చేశారు. శివ తొలి చిత్రంతోనే నటుడిగా ఆకట్టుకున్నారు. తదుపరి మనుచరిత్ర అనే సినిమాని కాజల్ ముఖ్య అతిథిగా ప్రారంభించిన సంగతి తెలిసినదే.
ఈ చిత్రంలో లై ఫేం మేఘా ఆకాష్ కథానాయికగా నటిస్తోంది. శివ ప్రస్తుతం `మను చరిత్ర` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో అతడు పూర్తి కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఇందులో అతడు తన పేరుకు తగ్గట్టే పొడవాటి గిరజాల జుట్టు గుబురు గడ్డంతో రెట్రో లుక్ లో కనిపించనున్నారు. అందుకు సంబంధించిన లుక్ తాజాగా బయటికి వచ్చింది.
మనుచరిత్ర అనేది ఘాఢమైన రొమాంటిక్ లవ్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం. ఇందులో రెట్రో కాలం నాటి యువకుడిగా.. నేటి మోడ్రన్ లుక్ తోనూ శివ కనిపిస్తారట. భరత్ కుమార్ పి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ మూవీతో పాటు శివ కందుకూరి `గమనం` అనే ఆంథాలజీ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అందులో ఓ ఔత్సాహిక క్రికెటర్ గా కనిపించనున్నాడు. వరుస చిత్రాలతో బిజీ అవుతున్న శివ తనని తాను నిరూపించుకోవాల్సి ఉంది.