Begin typing your search above and press return to search.

హిరణ్యకశ్యప కోసం భారీ ప్లాన్స్

By:  Tupaki Desk   |   4 July 2018 5:56 AM GMT
హిరణ్యకశ్యప కోసం భారీ ప్లాన్స్
X
చారిత్రాత్మక కథలను అలాగే మైథలాజికల్ స్టోరీలను తెరకెక్కించాలి అంటే అనుకున్నంత ఈజీ కాదు. ఆలోచనలు పేపర్ పై పెట్టడానికి సమయం చాలా పడుతుంది. ఇక ఆ ఆలోచనల్ని తెరపై చూపించాలంటే మరికొన్నేళ్లు. ఎంత అనుకున్న కూడా మూడేళ్లు ఓ సినిమా కోసం ప్రయాణం చేయాలి. ప్రస్తుతం గుణశేఖర్ కూడా అలాంటి కథతోనే సావాసం చేస్తున్నాడు. పౌరాణిక పాత్ర హిరణ్యకశ్యప ను మెయిన్ గా తీసుకొని ఇప్పటికే ఓ కథను అల్లాడు.

రానా దగ్గుపాటి కథానాయకుడు. ఈ కథను రానా ఎప్పుడో ఒప్పుకున్నాడు. ప్రస్తుతం దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. నిర్మాత సురేష్ బాబు ఎప్పటికప్పుడు గుణశేఖర్ తో చర్చలు జరుపుతున్నారట. ఇకపోతే సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయంపై ఇంకా చిత్ర యూనిట్ యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కచ్చితంగా నెక్స్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దాదాపు 180 కోట్లతో సురేష్ బాబు సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

పౌరాణిక పాత్రల గురించి కథల గురించి అందరికి తెలిసిందే. భక్త ప్రహ్లాద వంటి సినిమాలోని హిరణ్యకశ్యప పాత్ర ఇప్పటికి కూడా అందరికి నచ్చుతుంది. అయితే తెలిసిన కథ కాబట్టి విజువల్ వండర్స్ తో ప్రేక్షకులకు సినిమాను అందించాలని సురేష్ బాబు డిసైడ్ అయ్యారట. ఇప్పటికే ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ ముకేశ్ సింగ్ తో పౌరాణిక పాత్రలకు సంబందించిన డ్రాయింగ్స్ వేయిస్తున్నారట. ఇక వీలైనంత త్వరగా సినిమా గురించి అధికారిక వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.