Begin typing your search above and press return to search.

సీఎం జ‌గ‌న్ ని క‌లిసి ఏం విన్న‌విస్తారు?

By:  Tupaki Desk   |   3 Aug 2019 2:30 PM GMT
సీఎం జ‌గ‌న్ ని క‌లిసి ఏం విన్న‌విస్తారు?
X
ఏపీ- తెలంగాణ డివైడ్ త‌ర్వాత తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌ గురించి తెలిసిందే. హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌కు స‌మాంత‌రంగా ఏపీలో కొత్త సినీప‌రిశ్ర‌మ ఏర్పాటు గురించి విస్త్ర‌తంగా చ‌ర్చ సాగినా అది కార్య‌రూపం దాల్చ‌డంలో స‌ఫ‌లం కాలేదు. వైజాగ్ - అమ‌రావ‌తి- నెల్లూరు త‌డ వంటి చోట్ల కొత్త‌ ప‌రిశ్ర‌మను ఏర్పాటు చేసేందుకు సినీపెద్ద‌లు ఆలోచిస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. కాల‌క్ర‌మంలో బీచ్ సొగ‌సుల‌ వైజాగ్- ప్ర‌కృతి నిల‌యం అయిన అర‌కుకు చేరువ‌గా ఈ ప‌రిశ్ర‌మను ఏర్పాటు చేసే వీలుంద‌ని ప్రచారం సాగింది. వైజాగ్ లో స్టూడియోల నిర్మాణం అంటూ 2018 అంతా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోని ఎఫ్ డీసీ అధినేత అంబికాకృష్ణ హ‌డావుడి చేశారు. కానీ ఏదీ నిజం కాలేదు. అదంతా ఉత్తుత్తి ప్ర‌చారమేన‌ని ప్రూవైంది.

ప్ర‌స్తుతం ఫిలింఛాంబ‌ర్ వ‌ర్గాల్లో కానీ.. లేదా ఇత‌ర‌త్రా సినీపెద్ద‌ల్లో గానీ నామ మాత్రంగా అయినా కొత్త ప‌రిశ్ర‌మ గురించిన చ‌ర్చ సాగ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాట‌ల వ‌ర‌కే ప‌రిమితం కావ‌డంతో ఇక ఏదీ ఉండ‌ద‌నే అంద‌రూ ఫిక్స‌యిపోయారు. ఏపీ-ఎఫ్ డీసీ ప‌త్రికా ప్ర‌క‌ట‌నల్ని.. ప్రెస్ నోట్ స‌మాచారాన్ని ఎవ‌రూ న‌మ్మ‌లేదు. ఇంత‌కీ కొత్త టాలీవుడ్ తేదేపా- చంద్ర‌బాబు చేతిలో ఉందా? అన్న సందేహం వ్య‌క్త‌మైంది.

అందుకే ఏపీలో వైయ‌స్ జ‌గ‌న్ సార‌థ్యంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మైంది. జ‌గ‌న్ కొత్త సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి వైపు ఆలోచిస్తార‌ని ఉత్త‌రాంధ్ర బెల్ట్ లో యూత్ ముచ్చ‌టించుకున్నారు. అందుకే ఫిలిం డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ (ఏపీ ఎఫ్ డీసీ) అధ్య‌క్షుడిగా ఎవ‌రిని నియ‌మిస్తున్నారు? అన్న‌ది ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టికే అలీ స‌హా ప‌లువురు స్లార్ల పేర్లు వినిపిస్తున్నా ఏదీ క‌న్ఫామ్ కాలేదు. ఇక ఇప్ప‌టివ‌ర‌కూ కొత్త సీఎమ్ ని సినీప‌రిశ్ర‌మ త‌రపున క‌లిసేందుకు ఎవ‌రూ వెళ్ల‌లేద‌న్న ప్ర‌చారం ఉంది. దీనిపై ఏపీ ప్ర‌భుత్వం సైతం సీరియ‌స్ గానే ఉంద‌న్న చ‌ర్చ ఫిలింవ‌ర్గాల్లో సాగింది.

మొన్న 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ- పోసాని కాంట్ర‌వ‌ర్శీ ఎపిసోడ్స్ నేప‌థ్యంలో దీనిపైనా చ‌ర్చ సాగింది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కొత్త సీఎం ని క‌ల‌వ‌క‌పోవ‌డంపై పృథ్వీ సీరియ‌స్ అవ్వ‌డం అటుపై దానిని ఖండిస్తూ పోసాని మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి వివ‌ర‌ణ ఇవ్వ‌డం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా పోసాని ఒక మాట‌న్నారు. తెలుగు సినీప‌రిశ్ర‌మ త‌ర‌పున ఎవ‌రూ సీఎం జ‌గ‌న్ ని క‌ల‌వ‌లేద‌న‌డం స‌రికాద‌ని.. క‌లిసేందుకు ప్ర‌య‌త్నించార‌ని ఆయ‌న తెలిపారు. అగ్ర‌నిర్మాత డి.సురేష్ బాబు ఇప్ప‌టికే వైయ‌స్ జ‌గ‌న్ ని క‌లిసేందుకు ప్ర‌య‌త్నించారని అపాయింట్ మెంట్ కుద‌ర‌లేద‌ని తెలిపారు. త్వ‌ర‌లో జ‌గ‌న్ ని క‌లుస్తార‌ని పోసాని అన్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. టాలీవుడ్ త‌ర‌పున ఏపీ సీఎం జ‌గ‌న్ ని క‌లిస్తే అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు ఏం కోర‌బోతున్నారు. ఒక‌వేళ క‌లిస్తే సురేష్ బాబు ఏ సంగ‌తులు సీఎంతో ముచ్చ‌టిస్తారు? వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ ప‌రిస‌రాల్లో కొత్త టాలీవుడ్ ఏర్పాటు గురించి మాట్లాడ‌తారా? లేక నంది అవార్డులు ఈ ఏడాది ఉన్నాయా లేవా అని ప్ర‌శ్నిస్తారా? ఏపీ టాలీవుడ్ భ‌విష్య‌త్ గురించి.. ఇత‌ర‌త్రా అభివృద్ధి గురించి అడుగుతారా? ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. డి.సురేష్ బాబుతో పాటు ఇంకా ఎవ‌రెవ‌రు సినీపెద్ద‌లు సీఎం జ‌గ‌న్ ని క‌ల‌వ‌బోతున్నారు? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. ఇంత‌కీ ఎప్పుడు క‌ల‌వ‌నున్నారు? అన్న‌ది కూడా తేలాల్సి ఉంది.