Begin typing your search above and press return to search.

సురేష్‌ ప్రొడక్షన్స్‌ లోగోపై పిల్లలు ఎవరంటే..!

By:  Tupaki Desk   |   10 Jun 2019 10:35 AM GMT
సురేష్‌ ప్రొడక్షన్స్‌ లోగోపై పిల్లలు ఎవరంటే..!
X
తెలుగు సినిమా చరిత్రలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ కు చాలా కీలకమైన పాత్ర ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 55 ఏళ్ల క్రితం రామానాయుడు స్థాపించిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ లో ఎన్నో అద్బుత చిత్రాలు నిర్మాణం జరిగాయి. అత్యధిక భాషలో సినిమాలు నిర్మించి అరుదైన గిన్నీస్‌ రికార్డును సైతం రామానాయుడు దక్కించుకున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ లో పలు భాషల్లో.. ఎంతో మంది స్టార్‌ హీరోలతో సినిమాలు రూపొందాయి. అయితే అన్ని సినిమాల ఆరంభంలో వచ్చే సురేష్‌ ప్రొడక్షన్స్‌ లోగోపై ఉండే పిల్లల గురించి మాత్రం ఎవరికి పెద్దగా తెలియదు.

తాజాగా ఆ విషయమై సురేష్‌ బాబు క్లారిటీ ఇచ్చాడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ లోగో వెనుక ఉన్న కథను ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్‌ బాబు చెప్పుకొచ్చాడు. సురేష్‌ బాబు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను తమ్ముడు వెంకటేష్‌ స్కూల్‌ కు వెళ్తున్న సమయంలో నాన్న గారు పిలిచారు. అప్పటికే అక్కడ ఎస్‌ మరియు పీ రెండు అక్షరాలు ఉన్నాయి. చెరో అక్షరంపై ఎక్కమని సూచించారు. ఆయన సూచన మేరకు నేను పీ అక్షరంపై తమ్ముడు వెంకటేష్‌ ఎస్‌ అక్షరంపై నిల్చున్నాము.

ఆ తర్వాత ఫొటోలు దించి వాటిని లోగోగా తయారు చేయించారు. యాదృశ్చికంగా జరిగినా ఎస్‌ పై నిల్చున్న వెంకటేష్‌ స్టార్‌ అయ్యాడు.. పి అక్షరంపై నిల్చున్న నేను ప్రొడ్యూసర్‌ ను అయ్యానంటూ సురేష్‌ బాబు చెప్పుకొచ్చారు. ఇక సినిమా షూటింగ్స్‌ విషయాలు నిర్మాణం గురించి నేను అస్సలు పట్టించుకునేవాడిని కాదు. ఆసక్తి లేకపోవడంతో పెద్దగా ఆ విషయాలను తెలుసుకునేందుకు కూడా ఇష్టపడలేదు. అయితే నాన్న గారు సురేష్‌ ప్రొడక్షన్స్‌ లో రూపొందిన సినిమాల రోజూ వారి కలెక్షన్స్‌ ను నాకు ఇస్తే వాటిని నేను ఒక నోట్‌ బుల్‌ లో ఎక్కించాల్సి ఉండేది. అలా నా సినిమా ప్రొడక్షన్‌ పని మొదలు అయ్యింది. కాలేజ్‌ డేస్‌ ల్లో సినిమా ప్రొడక్షన్‌ వ్యవహారాల్లోకి మరింత లోతుగా దిగాను. అలా నా సినిమా రంగ ప్రవేశం జరిగిందని సురేష్‌ బాబు చెప్పుకొచ్చాడు.