Begin typing your search above and press return to search.
`లైగర్` బయ్యర్లకు తమ్మారెడ్డి కౌంటర్!
By: Tupaki Desk | 30 Oct 2022 6:30 AM GMT`లైగర్` వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నష్టాలు పూరించాలంటూ దర్శకుడు పూరిజగన్నాధ్ పై బయ్యర్లు తెస్తోన్న ఒత్తిడిపై ఇప్పటికే పూరి సైతం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. వివాదం పోలీస్ స్టేషన్ చేరింది.
నష్టాన్ని భర్తీ చేయడానికి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. చట్టపరంగా వాళ్లకు ఎలాంటి హక్కు లేదని..కొనుగోలుదారులపై పూరీ ఫిర్యాదు చేశారు. మరోవైపు బయ్యర్లు పూరి ని ఎలాగైనా సాధించి నష్టాలు పూరించుకోవాలని విశ్వ ప్రయత్నాల చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై దర్శక-నిర్మాత తమ్మారెడ్డి తనదైన శైలిలో స్పందించారు.
విజయ్ దేవరకొండ కోసం ఇంత ఖర్చు పెట్టమని బయ్యర్లని ఎవరు అడిగారు? అతని మార్కెట్ లేదా అతని మునుపటి కొన్ని సినిమాలు ఎలాంటి వసూళ్లు సాధించాయో వారికి తెలియదా? అవన్నీ తెలిసి కూడా పూరి మీద పడటం భావ్యమేనా? అని ప్రశ్నించారు. హిట్ అయితే లాభాలు తీసుకుంటారు. సినిమాపోతే ఆ నష్టాలు ఆయన భరించాలా? ఎదురు ప్రవ్నించారు.
ఇది సరైన పద్ధతి కాదు. బయ్యర్లు సరైన అంచనాలతో సినిమాను కొనాలి. మార్కెట్ ని ఎప్పటికప్పుడు స్టడీ చేసి ముందుకెళ్లాలి. అలా కాకుండా లాభాలొక్కటే ఊహించుకుంటే పరిస్థితులు చేజారిన తర్వాత చేసేదేం ఉండదు. సినిమాలను కొనమని ఎవరూ అడగడం లేదు. పూరీ వాళ్ల ఇళ్లకు వెళ్లి రిక్వెస్ట్ చేశారా? గతంలో `నేనింతే` సినిమా విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది అని న్నారు.
`లైగర్` రిలీజ్ అయిన తర్వాత తమ్మారెడ్డి సినిమాని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా ట్రైలర్ చూసిన తర్వాత లైగర్ చూడాలనిపించలేదని..పూరి సినిమాలంటే తనకు బాగా ఇష్టమని కానీ ట్రైలర్ తర్వాత ఆసక్తిపోయిందన్నారు. అలాగే లైగర్ ఎప్పుడైనా చూడాలనిపిస్తే అప్పుడు టీవీలో చూస్తానని అన్నారు.
అలాగే హీరో విజయ్ ప్రవర్తనా విధానంపైనా గతంలో ఆయన సంలచన వ్యాఖ్యలు చేసారు. హీరోలు ఊరికే ఎగిరెగిరి పడటం మంచిది కాదు. అలాగే ఇష్టం వచ్చినట్లు స్టేట్ మెంట్లు దేశాన్ని ఊపేస్తాం.. తగలెడతాం.. అంటే ఇలాగే ప్రేక్షకులు మనల్ని తగలెడతారు. అంటూ ఆక్రోశించారు. అయ్యా దండం పెడతాం మంచి సినిమా తీశాం.. మీరు చూడండి అని అడిగితే చూస్తారు గానీ ఇలా చిటికెలు వేసి చెబితే.. వారు చిటికెలు వేసి ప్లాప్ చేస్తారు` అంటూ ఘాటుగానే వ్యాఖ్యానించారు.