Begin typing your search above and press return to search.
గుసగుస: పెద్ద హీరోతో పెద్ద చిక్కొచ్చి పడిందట
By: Tupaki Desk | 20 March 2021 4:06 AM GMTతన సినిమాల ప్రచారానికి రాలేనని ముందే నిర్మాతతో ఒప్పందం చేసుకుంటారు స్టార్ హీరోయిన్ నయనతార. దానికి వ్యక్తిగత కారణాలున్నాయి. కానీ టాలీవుడ్ లో ఆ అగ్ర హీరో వైఖరి అందుకు భిన్నం. తొలి నుంచి పబ్లిక్ అప్పియరెన్సులు అంటేనే అనాసక్తి. పెద్దంతగా వేదికలపై కనిపించరు. తన సినిమాల ప్రమోషన్ కి రావాలన్నా అరకొరగానే.. ఆయన మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రచారం చేసేది శూన్యం.
పైగా ఇప్పుడు రాజకీయాల్లోనూ ఆయన బిజీగా ఉండడంతో త్వరలో రిలీజ్ కి రాబోతున్న కంబ్యాక్ మూవీ ప్రమోషన్ ఎలా? అన్నది దర్శకనిర్మాతలకు చిక్కొచ్చి పడిందట. ఆయన వస్తారా రారా? హీరోగారి ఇంటర్వ్యూల కోసం మీడియాని పిలవాలా వద్దా? అన్న డైలమా కూడా నెలకొందట.
అయితే ఆయనతో ఏదైనా రికార్డెడ్ ఇంటర్వ్యూతో సరిపెట్టుకోవాలి. అలాగే త్వరలో ప్రీరిలీజ్ వేడుక వరకూ ఆయన ప్రచారం బ్లాక్ బస్టర్ అయితే చాలన్న మైండ్ సెట్ కూడా అలవరుచుకున్నారట. ఇక ఇదే వేదికపై సదరు హీరోతో పాటు పలువురు అగ్ర హీరోలు కనిపిస్తారన్నది పాజిటివ్ మ్యాటర్. ఇన్నాళ్లు సరైన ప్రమోషన్ అన్నదే లేకపోవడంతో అంత పెద్ద సినిమా అయినా బజ్ రాలేదు. ప్రీబిజినెస్ సాగినంతగా రిటర్నులు రప్పించాలంటే ఇలా అయితే కష్టమేనన్న బెంగా నిర్మాతను నిలవనీయడం లేదట. అందుకే రొటీన్ కి భిన్నంగా ఈసారి మీ ప్రమోషన్ కావాలి! అంటూ హీరోగారిని సదరు నిర్మాత ఆగలేక అడిగేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోని అడగాలంటేనే మొహమాటం .. కానీ ధైర్యం చేసి అడిగారు. మరి ఆయన ఇంటర్వ్యూల కోసం ముందుకొస్తారా..? అసలు ఏం జరుగుతుందో కాస్త ఆగితే కానీ తెలీదు. ఏప్రిల్ ఆరంభంలో రిలీజ్ కి వస్తున్న ఆ సినిమాకి అనూహ్యంగా హైప్ తేవడం కోసం హైరానా పడుతున్నారని గుసగుస!