Begin typing your search above and press return to search.

నిర్మాతను చితకబాదేశారు

By:  Tupaki Desk   |   13 March 2017 7:32 AM GMT
నిర్మాతను చితకబాదేశారు
X
బలహీనతను అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకునే బ్యాచ్ ఎక్కువే. అందులోని సినీ రంగంలో ఇలాంటి మాయలు చాలానే ఉంటాయి. సినిమా పేరుతో మాయ చేసేవారికి చిత్రపరిశ్రమలో కొదవ లేదు. తాజాగా అలాంటి వెధవ పని చేసి మరీ అడ్డంగా బుక్ అయ్యాడో నిర్మాత. సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని చెప్పి.. లైంగికంగా వేధిస్తున్న నిర్మాతను చితక్కొట్టేసి మరీ పోలీసులకు అప్పగించిన వైనమిది.

బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ‘‘ప్రీతి మాయ హుషారు’’ అనే కన్నడ సినిమా ప్రొడ్యూసర్ వీరేశ్.. తన ఆఫీసులో పని చేసే ఒక యువతికి సినిమా ఛాన్స్ పేరుతో వలేశారు. సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని చెప్పి.. లైంగికంగా వేధించటం షురూ చేశాడు. తనకు సహకరిస్తే.. హీరోయిన్ గా అవకాశం ఇవ్వటమే కాదు.. తనకు తెలిసిన బడా నిర్మాతలకు పరిచయం చేసి.. అవకాశాలు ఇస్తానంటూ వెంటపడ్డాడు.

నిర్మాత చేష్టలకు విపరీతంగా విసిగిన సదరు యువతి.. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితిని ఇంట్లో వారికి చెప్పసింది. దీంతో.. బాధితురాలి కుటుంబ సభ్యులు వీరావేశంతో బెంగళూరులోని హెచ్ ఎస్ ఆర్ లేఔట్లో ఉండే నిర్మాత వీరేశ్ ఇంటికి వచ్చి.. రౌండప్ చేసి మరీ చితక్కొట్టేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అతడిపై కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఇష్యూపై దర్యాఫ్తు షురూ చేశారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/