Begin typing your search above and press return to search.
సంపాదించిందీ ఎక్కువే.. పోగొట్టుకున్నదీ ఎక్కువే!
By: Tupaki Desk | 11 Jun 2022 12:30 PM GMTఒకప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఎమ్మెస్ రాజు ఒకరు. ఆయన బ్యానర్లో సినిమా చేయాలని స్టార్ హీరోలు .. హీరోయిన్స్ ఉత్సాహాన్ని చూపేవారు. 'శత్రువు' .. 'వర్షం' .. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి సూపర్ హిట్స్ ఆయన బ్యానర్లో ఉన్నాయి. ఆ తరువాత ఆయన కొన్ని పరాజయాలు కూడా చూశారు. ఇక పై తాను ట్రెండ్ కి తగినట్టుగా వెళతానని చెప్పి దర్శకుడిగా ఆయన రంగంలోకి దిగారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన '7డేస్ 6 నైట్స్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను ఆయన పంచుకున్నారు.
"ఇంతకుముందు నిర్మాతగా నేను ఎన్ని హిట్స్ ఇచ్చాను అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ కూర్చోను. నెక్స్ట్ కొత్తగా ఏం చేయాలి? అనే ఆలోచన చేస్తుంటాను. ట్రెండ్ కి తగినట్టుగా ఉండే కథలను ఎంచుకుంటూ ఏడాదికి రెండుమూడు సినిమాలైనా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను.
ఆ దిశగానే ప్రయత్నాలు చేసుకుంటున్నాను. అప్పట్లో మా అబ్బాయిని హీరోగా నా దర్శకత్వంలో పరిచయం చేయడమే కరెక్ట్ అనుకున్నాను. ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని ఇప్పుడు అనిపిస్తోంది.
మా అబ్బాయి కెరియర్ విషయంలో .. కొన్ని కథల ఎంపిక విషయంలో తీసుకున్న నిర్ణయాలు సరైన ఫలితాలను ఇవ్వలేదు. కానీ నా వల్లనే మా అబ్బాయి కెరియర్ దెబ్బతిందనేది కరెక్ట్ కాదు. దాంతో కొంత సమయం తీసుకుని తాను మంచి కథలను ఎంచుకోవడం .. నేను కూడా అప్ డేట్ కావడానికి కొంత సమయం తీసుకోవడం జరిగాయి.
ఇప్పుడు నేనేం చేయాలి? మా అబ్బాయి ఎలాంటి సినిమాలు చేయాలి? అని విషయంలో పూర్తి క్లారిటీ ఉంది. నా బ్యానర్లో ప్రభాస్ .. మహేశ్ బాబులకు తిరుగులేని హిట్స్ ఇచ్చాను. అలాంటి హిట్ ఒకటి మా అబ్బాయికి కూడా ఇస్తాననే నమ్మకం నాకు ఉంది.
మా అబ్బాయి ఎలాంటి కథలకు సెట్ అవుతాడు .. ఎలాంటి పాత్రలకు సెట్ అవుతాడనేది నాకు తెలుసు. అవకాశం ఉంది కదా అని చెప్పేసి ప్రతి ప్రాజెక్టులో మా అబ్బాయిని పెట్టే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. సినిమాల్లోకి వచ్చిన తరువాత సంపాదించిందీ ఎక్కువే .. అలాగే పోగొట్టుకున్నదీ ఎక్కువే. ఒక్క నేను అనే కాదు చాలామంది తమ జీవితంలో మొత్తం కోల్పోయి .. మళ్లీ అక్కడి నుంచి ఎదుగుతూ వచ్చినవారున్నారు. నేను అంతే .. ఆ దిశగానే వెళుతున్నాను. అంతేగానీ జరిగినదానికి బాధపడుతూ .. వ్యసనాలతో కాలం గడపడం నాకు అలవాటు లేదు" అని చెప్పుకొచ్చారు.