Begin typing your search above and press return to search.

కుర్ర బ్యూటీ గొంతెమ్మ కోర్కెల‌కు బిత్త‌ర‌పోయిన నిర్మాత‌‌!

By:  Tupaki Desk   |   4 March 2021 11:30 PM GMT
కుర్ర బ్యూటీ గొంతెమ్మ కోర్కెల‌కు బిత్త‌ర‌పోయిన నిర్మాత‌‌!
X
దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాలి! ఈ ఫార్ములాని మ‌న అందాల క‌థానాయిక‌లు ఏనాడో వంట‌బ‌ట్టించుకున్నారు. రంగుల మాయా ప్ర‌పంచంలో ప్ర‌వేశించాక ఎప్పుడు ఏ సీన్ ఎలా మారుతుందో చెప్ప‌లేం. అందుకే జోరుమీదున్న‌ప్పుడే ఫుల్ గా నిర్మాత‌ల నుంచి దండుకోవాల‌ని భావిస్తారు చాలామంది భామ‌లు.

ఇటీవ‌ల తొలి చిత్రంతోనే రికార్డ్ బ్రేకింగ్ హిట్టు కొట్టి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో జోరుమీదున్న కుర్ర‌బ్యూటీ నుంచి ఓ బ‌డా నిర్మాత‌కు ఎదురైన అనుభ‌వం వింటే షాక్ తినాల్సిందే. కోటి పారితోషికం డిమాండ్ చేయ‌డ‌మే గాకుండా గొంతెమ్మ కోర్కెలు కోరింద‌ట‌. త‌న కండీష‌న్ల‌కు ఓకే అంటేనే సంత‌కం చేస్తాన‌ని ఖ‌రాకండిగా చెప్పేసింద‌ట‌. దీంతో బిత్త‌ర‌పోయిన స‌ద‌రు నిర్మాత ఏం చేయాలో తోచ‌క‌ నీళ్లు న‌మిలాడ‌ట‌.

డెబ్యూ చిత్రానికి జ‌స్ట్ రూ.6ల‌క్ష‌లు అందుకున్న ఈ భామ రెండో సినిమాకే 60ల‌క్ష‌లు అందుకుంటోంది. ఇప్పుడు కొత్త‌ సినిమా‌కు కోటి అడిగేసింద‌ట‌. పారితోషికానికి సౌక‌ర్యాలు అద‌నం. త‌న స్టాఫ్ కి జీతాలు.. ప్ర‌యాణాల‌కు టిక్కెట్లు.. తిండి కాస్ట్యూమ్స్ అంటూ ర‌క‌ర‌కాల చిట్టా విప్పింద‌ట‌. దీంతో స‌ద‌రు అగ్ర నిర్మాత‌కు చుక్క‌లు క‌నిపించాయ‌ని చెబుతున్నారు. అనుష్క ద‌గ్గ‌రే అంత లేదు.. ఒక డెబ్యూ నాయిక ఇంత అడిగేస్తోందా? అంటూ షాక్ కి గురై ఆ త‌ర్వాత త‌న ఆలోచన‌‌నే విర‌మించుకున్నార‌ట‌. అస‌లు కంటే కొస‌రు కోరిక‌ల చిట్టానే పెద్ద‌దిగా ఉంది! అంటూ స‌ద‌రు నిర్మాత స‌న్నిహితుల వ‌ద్ద‌ గొణిగేస్తున్నార‌ట‌. ఇంత‌కీ అంత పెద్ద షాకిచ్చిన ఆ కుర్ర‌బ్యూటీ ఎవ‌రై ఉంటారు? ఆ నిర్మాత ఎవ‌రు..?! గెస్ హూ దే ఆర్?