Begin typing your search above and press return to search.
రీమేక్ నిర్మాతల కళ్లు ఆ సినిమాపైనే..!
By: Tupaki Desk | 27 May 2022 2:30 AM GMTబాలీవుడ్ లో ఎందరు స్టార్ హీరోలు ఉన్నా ఆ హీరో కొట్టే హిట్లే వేరు. కంటెంట్ ని నమ్ముకుని వరుసగా సినిమల్లో నటిస్తున్న ఆయుష్మాన్ ఖురానా మరోసారి అలాంటి ప్రయత్నమే చేసి సక్సెస్ అందుకోబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా-నటించిన 'అనేక్' డీసెంట్ ఓపెనింగులను సాధించనుందని టాక్ వినిపిస్తోంది.
ఆయుష్మాన్ ఖుర్రానా-నటించిన అనేక్ ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఈ సంవత్సరం కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇది మరో కంటెంట్-ఆధారిత చిత్రం. కాశ్మీర్ మారణహోమం నేపథ్యంలో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన భౌగోళిక-రాజకీయ చిత్రం తరహాలోనే అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన 'అనేక్' ఈశాన్య ప్రాంతాల భౌగోళిక రాజకీయాలను ఎంచుకొని ప్రస్తుత కాలంలో సెట్ చేసిన స్టోరీతో రన్ అవుతుంది. ఇది అండర్ కాప్ స్టోరీ.
ఈ మూవీ గొప్ప అనుభూతుల సమాహారంగా తెరకెక్కిందని.. చాలా పెద్ద కమర్షియల్ సెటప్ తో మెప్పించనుందని టాక్ వినిపిస్తోంది. సినిమా ప్రోమో ఆకట్టుకుంది. ఒరిజినల్ కంటెంట్ తో ట్రైలర్ మెప్పించగానే జనాల అటెన్షన్ అటువైపు మళ్లింది. యాక్షన్ తో పాటు హై డ్రామా డైలాగ్ పవర్ తో ట్రైలర్ ఆకట్టుకుంది.
ఇంతకుముందు ఆర్టికల్ 15 ప్రధాన అంశం నేపథ్యంలో అనుభవ్ సిన్హా-ఆయుష్మాన్ ఖుర్రానా కాంబినేషన్ మూవీ పెద్ద హిట్టయ్యింది. దేశంలోని ప్రస్తుత స్థితి కులతత్వంపై తీసిన సినిమా ఆర్టికల్ 15 తొలిరోజు రూ. 5.02 కోట్లు వసూలు చేయగా టోటల్ రన్ లో రూ. 65.45 కోట్లు తేగలిగింది.
ఇప్పుడు థియేటర్లలో ఇదే తరహా వసూళ్లు సాధించాలని 'అనేక్' బృందం భావిస్తోంది. తూర్పు ఇండియాలో అస్థిర పరిస్థితుల్ని సరిదిద్దే అండర్ కాప్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా యూత్ కి నచ్చుతుందని చెబుతున్నారు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా ఆరంభ వసూళ్లు ఆశించినంతగా ఉండవు. మౌత్ టాక్ ద్వారా ఆ తర్వాత పుంజుకునే వీలుంటుంది. రూ. 3-4 కోట్ల రేంజు ఓపెనింగుతో ఇది మొదలవుతుందని అంచనా. వారాంతంలో వసూళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. అనేక్ ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
ఇక అనేక్ మూవీకి ఉన్న ముందస్తు టాక్ దృష్ట్యా ఈ సినిమా సౌత్ రీమేక్ హక్కులకు డిమాండ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. గతంలో ఆయుష్మాన్ నటించిన సినిమాల రీమేక్ హక్కులను ఛేజిక్కించుకునేందుకు టాలీవుడ్ అగ్ర నిర్మాత డి సురేష్ బాబు ఎంతో ఆసక్తిగా వేచి చూసేవారు. కంటెంట్ ఉంటే సినిమా హిట్టవుతుందని నమ్మే సదరు నిర్మాత కళ్లు ఈసారి ఎవరిపై ఉన్నాయో తెలియాల్సి ఉంది. ఈసారి అనేక్ మూవీ రీమేక్ హక్కులను తెలుగులో ఎవరు దక్కించుకుంటారో చూడాలి.