Begin typing your search above and press return to search.
స్టార్ల సిబ్బందికి అలా చెక్ పెట్టిన నిర్మాతలు!
By: Tupaki Desk | 2 Sep 2022 4:17 AM GMTతెలుగు సినీపరిశ్రమ పారితోషికాల చెల్లింపుల్లో ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతున్నట్టే కనిపిస్తోంది. ఫిలింఛాంబర్ తో కలిసి నిర్మాతలు అన్ని సవరణలు చేయడంలో సఫలమవుతున్నారని అర్థమవుతోంది. తాజా సమాచారం మేరకు.. తారల టెక్నీషియన్ల సిబ్బంది ప్యాకేజీల వ్యవహారం.. అలానే కార్మికుల వేతనాల గురించి అసంతృప్తికి సంబంధించి కొన్ని కీలక ప్రకటనలను ఛాంబర్ విడుదల చేసింది.
ఇకపై సినిమాల నిర్మాణానికి సంబంధించి ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు రోజువారీ చెల్లింపులు ఉండవు. నిర్మాత ఆర్టిస్ట్ కు అంగీకరించిన మొత్తాన్ని మినహాయించి నేరుగా కళాకారులకు ఎలాంటి ఇతర అదనపు మొత్తాలను చెల్లించకూడదు. నిజానికి వందమంది పని చేసే యూనిట్ లో హీరోయిన్స్ టీమ్ వల్ల నిర్మాతపై భారీగా భారం పడుతోంది. హీరోయిన్ల వసూళ్ల ప్రహనం ఇబ్బందికరంగా ఉందని నిర్మాతలు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నటీనటుల కుయుక్తులకు ఇక తలొంచేది లేదని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. సదరు నటీనటులు డిమాండ్ చేసే అదనపు చెల్లింపులు అహేతుక సౌకర్యాలు ఇక నుండి అందుబాటులో ఉండవు. అంగీకరించిన మొత్తం తప్ప నటులకు సంబంధించిన ఏ ఇతర మొత్తాన్ని నేరుగా చెల్లించకూడదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది.
సింపుల్ గా చెప్పాలంటే తారలు తమ సిబ్బందికి మేకప్ టీమ్ కి.. పర్సనల్ అసిస్టెంట్ లకు.. మేనేజర్ లకు.. హెయిర్ డ్రెస్సర్ లకు డ్రైవర్లకు..స్టైలిస్ట్ ల కోసం డిమాండ్ చేస్తున్న డబ్బును నిర్మాతలు ఇక చెల్లించరు. దానిని స్టార్లు తమ పారితోషికం నుంచి స్వయంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. తారల సిబ్బందికి అదనపు సౌకర్యాలు లేదా రవాణా డిమాండ్ చేస్తే దానికి నటీనటులే స్వయంగా చెల్లించుకోవాలి. నిర్మాత అంగీకరించిన రెమ్యునరేషన్ ను మాత్రమే చెల్లిస్తారు. ఇందులో సిబ్బందికి చెల్లింపు ఉంటుంది. హీరోయిన్ల కోసం నిర్మాతలు కోట్లాది రూపాయల పారితోషికాలను చెల్లిస్తున్నది ఇందుకే.
పలువురు అగ్ర కథానాయికలు నిరంతరం పది మంది పైగా బెటాలియన్ తో నగరంలో దిగినప్పటి నుంచి స్టార్ హోటల్ బస సౌకర్యంతో పాటు సిబ్బందికి ఏర్పాట్ల వరకూ ప్రతిదీ నిర్మాతలపైనే భారం మోపుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ నిర్ణయాలు - ప్రకటనల పూర్తి సారాంశం ఇదీ:
*కళాకారులు/సాంకేతిక నిపుణులకు రోజుకు చెల్లింపులు ఉండవు.
కళాకారులందరి వేతనాలలోనే సిబ్బంది.. స్థానిక రవాణా.. స్థానిక ఖర్చులు మిళితమై ఉంటాయి. వసతి ప్రత్యేక ఆహారం మొదలైనవి కూడా ఇందులోనే. నిర్మాత ఖరారు చేయవలసిన మొత్తం ఒకసారి ఫిక్స్ చేశాక అదనపు మొత్తాల చెల్లింపులు ఇక ఉండవు.
* చీఫ్ టెక్నీషియన్ల వేతనాలు సిబ్బంది.. స్థానిక ఖర్చులు సహా ఖరారు చేయబడతాయి. వసతి- స్థానిక రవాణా- ప్రత్యేక ఆహారం మొదలైనవి నిర్మాత అందించకూడదు. అంగీకరించిన మొత్తం మినహా సాంకేతిక నిపుణుడికి సంబంధించిన ఏవైనా మొత్తాలను నేరుగా చెల్లించాలి. అన్ని ఒప్పందాలు ప్రారంభించడానికి ముందు రుసుము వివరాలతో నమోదు చేయాలి.
*ఏదేని చిత్రం షూటింగ్ వివరాలు సహా అన్ని ఒప్పందాలు ఛాంబర్ ద్వారా ధృవీకరించబడాలి.
*క్రమశిక్షణ/కాల్ షీట్ సమయాలను ఇకపై కఠినంగా అమలు చేయాలి. అందరి ప్రయోజనం కోసం షూటింగ్ కి సంబంధించిన నిర్మాత రోజువారీ నివేదికను నిర్వహించాలి.
*OTT విషయానికి వస్తే.. సినిమా శీర్షికలు(టైటిల కార్డ్స్)/థియేట్రికల్ విడుదలలో OTT & శాటిలైట్ భాగస్వాములను చేర్చడం లేదు. OTT విత్ హోల్డ్ విండో కనీసం 8 వారాల నియమాన్ని అనుసరించాలి.
*థియేట్రికల్/ఎగ్జిబిషన్ విషయానికి వస్తే... VPF చర్చలు కొనసాగుతున్నాయి. తదుపరి సమావేశం 3.09.2022న జరగాల్సి ఉండగా..డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల సూచన మేరకు 06-09-2022కి వాయిదా వేసారు. దీనికి సంబంధించి తుది చర్చలు సాగాలి. ఈ సమావేశంలో ఆమోదించే లేదా ఖరారు చేసే రేట్ కార్డ్ లు ఉంటాయి.
ఏ నిర్ణయం ధృవీకరించాక తర్వాత అన్ని ప్రొడక్షన్ హౌస్ లతో భాగస్వామ్యం చేస్తారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.