Begin typing your search above and press return to search.
నిర్మాతల మండలి ఎన్నికల డేట్ ఫిక్స్..!
By: Tupaki Desk | 18 Jan 2023 1:34 PM GMTతెలుగు నిర్మాతల మండలి ప్రస్తుత అధ్యక్షుడిగా సి కళ్యాణ్ ఉన్నారు. అయితే ఆయన పదవి కాలం ముగిసినా సరే నిర్మాతల మండలి ఎన్నికలు నిర్వహించడం లేదని కొందరు నిర్మాతలు ఈమధ్య సమావేశంలో గొడవ చేశారు. దానిపై ఆయన అప్పుడే వివరణ ఇచ్చారు. ఇక లేటెస్ట్ గా సి కళ్యాణ్ నిర్మాతల మండలి ఎలక్షన్స్ గురించి క్లారిటీ ఇచ్చారు. కొందరు కావాలనే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆర్గనైజేషన్ కు చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తే ఊరుకునేది లేదని కళ్యాణ్ అన్నారు.
ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఫిబ్రవరి 19న ఎన్నికలు అదే రోజు కౌంటింగ్.. జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని సి కళ్యాణ్ చెప్పారు. మా కౌన్సిల్ లో 9 కోట్లు ఉన్నాయి. తిరుపతిలో ఒక బిల్డింగ్ కూడా ఉంది. మూవీ టవర్స్ లో 2.40 కోట్లు ఇన్వెస్ట్ చేయగా ఇప్పుడు అది 10 కోట్ల దాకా అయ్యింది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గురించి సోషల్ మీడియా ద్వారా కొందరు బురద చల్లుతున్నారని అలాంటి వారిపై కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతేకాదు తనకు ఎలాంటి పదవి వ్యామోహం లేదని అన్నారు సి. కళ్యాణ్.
అంతేకాదు ప్రభుత్వాలు మారినా పరిశ్రమకు ఒరిగిదేమి లేదని. చిత్ర పరిశ్రమ ఆంధ్రాకు వెళ్తుందని తాను అనుకోవట్లేదని అన్నారు. ఇక తెలుగు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నంది, సింహా అవార్డులు ఇవ్వాలని అన్నారు సి.కళ్యాణ్. తన పదవి కాలం ముగిసినా ఇంకా టి.ఎఫ్.పి.సీ అధ్యక్షుడిగా ఉంటున్నందుకు పలువురు నిర్మాతలు సి కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ఫైనల్ గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ డేట్ ఫిక్స్ అయ్యింది.
అయితే ఈసారి ఈ ఎలక్షన్స్ లో ఎవరెవరు పోటీ పడతారు. నిర్మాతల మండలి అభివృద్ధికి వారు ఎలాంటి కార్యచరణలు చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది. నిర్మాత బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది కాబట్టి నిర్మాతల మండలి నిర్మాతల బాగు కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.