Begin typing your search above and press return to search.
సీక్రెట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్న ప్రొడ్యూసర్స్
By: Tupaki Desk | 27 March 2020 11:50 AM GMTప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ఇప్పటికే 190 దేశాలకు పైగా విస్తరించిన ఈ వైరస్ భారతదేశాన్ని కూడా తాకింది. యావత్ దేశం మొత్తం కూడా కరోనా భయానికి వణికిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ కి కూడా కోలుకోలేని దెబ్బ పడింది. కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్‌లోకి వెళ్లింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి, అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. హీరోల దగ్గరి నుండి చిన్న చిన్న టెక్నిషన్స్ దాకా పనులు లేక పోవడంతో ఇంటికే పరిమతమయ్యారు.
కానీ కొంతమంది నిర్మాతలు మాత్రం కరోనా డేస్ ని కూడా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వల్ల సినిమా షూటింగులు అర్ధాంతరంగా ఆగిపోయినప్పటికీ కొన్ని సినిమాలు ఇప్పటికే చాలా భాగం షూటింగ్ చేసి ఉన్నారు. ఆ సినిమా నిర్మాతలు తమ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సీక్రెట్ గా చేసుకుంటున్నారట. ఇండస్ట్రీలో చాలా మంది ప్రొడ్యూసర్స్ తమ ఆఫీసుల్లోనే సీక్రెట్ గా పనులు మొదలు పెట్టేసారని సమాచారం. అంతేకాకుండా దీని కోసం వర్క్ చేస్తున్న టెక్నిషన్స్ కి డబల్ పేమెంట్ కూడా ఆఫర్ చేశారట. అయితే ఇప్పుడు ఈ విషయం బయటకు పొక్కడంతో ఈ సీక్రెట్ పనులకు అడ్డుకట్ట పడిందట. ఏదేమైనా ఇప్పుడు కరోనా డేస్ ని కూడా క్యాష్ చేసుకోవాలని చూసిన నిర్మాతలు విమర్శల పాలయ్యారు. ఆ సినీ నిర్మాతలకు మరీ అంత ఆశ ఉండకూడదని ఇది తెలిసిన వాళ్ళు విమర్శిస్తున్నారు.