Begin typing your search above and press return to search.
ఆ సెట్ తో 'రంగ్ దే' బడ్జెట్ చాలా తగ్గిందట
By: Tupaki Desk | 26 Sep 2020 3:30 AM GMTనితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'రంగ్ దే'. ఈ సినిమా కథానుసారంగా హీరో హీరోయిన్ ల కాంబో సీన్స్ ఎక్కువగా అమెరికాలోని ఒక ఇంట్లో షూట్ చేయాల్సి ఉందట. అయితే ఎక్కువ రోజులు అమెరికాలో షూటింగ్ అంటే చాలా ఆర్థిక భారంతో కూడుకున్నదని అలాగే చిత్ర యూనిట్ సభ్యులందరిని అక్కడకు తీసుకు వెళ్లడం ఈ సమయంలో కష్టంగా భావించిన దర్శక నిర్మాతలు అమెరికాకు వెళ్లకుండానే హైదరాబాద్ కు అమెరికా ఇల్లును తీసుకు రావాలని ప్లాన్ చేశారట. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తో అమెరికా వాతావరణం కనిపించేలా ఇల్లు నిర్మించారట.
కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆ ఇంట్లోనే ఉండనున్నాయి. ఆ ఇంటి కోసం మేకర్స్ ఏకంగా కోటిన్నర వరకు ఖర్చు చేశారట. ఈ సెట్ వల్ల అమెరికా వెళ్లి షూటింగ్ చేయాల్సిన అవసరం లేదు కనుక నిర్మాతలకు చాలా వరకు బడ్జెట్ సేవ్ అవుతుందట. కరోనా కారణంగా ఆరు నెలలు గ్యాప్ ఇచ్చిన యూనిట్ సభ్యులు ఇటీవలే హైదరాబాద్ లో చిత్రీకరణ పునః ప్రారంభించారు. వచ్చే నెలలో యూరప్ కు వెళ్లి అక్కడ రెండు పాటల చిత్రీకరణ కూడా చేయనున్నారట. నితిన్ పెళ్లి సందర్బంగా విడుదల అయిన వీడియో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామంటూ దర్శకుడు వెంకీ పేర్కొన్నారు.