Begin typing your search above and press return to search.

మీడియా మంటలు ఆపాలంటూ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా బహిరంగ లేఖ...!

By:  Tupaki Desk   |   4 Sep 2020 5:34 PM GMT
మీడియా మంటలు ఆపాలంటూ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా బహిరంగ లేఖ...!
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ మరణాంతరం బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోని ప్రముఖులు సైతం బాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువగా ఉందని.. స్టార్ కిడ్స్ కిన్ టాలెంట్ తో సంబంధం లేకుండా ఛాన్సెస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటారని ఆరోపించారని. సోషల్ మీడియాలో నెటిజన్స్ సుశాంత్ మరణానికి ఒక విధంగా బాలీవుడ్ లోని కొందరు పెద్ద మనుషులు కారణమంటూ నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో మీడియా సైతం బాలీవుడ్ డర్టీ సీక్రెట్స్‌ అంటూ రెగ్యులర్ గా అనేక కథనాలు వెల్లడిస్తూ వస్తోంది. ఈ మధ్య బంధుప్రీతి ఫేవరిజంతో పాటు డ్రగ్స్‌ వంటి పలు అంశాలపై డిస్కషన్స్ చేస్తున్నారు. అయితే తాజాగా సినీ ఇండస్ట్రీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (భారత చలనచిత్ర నిర్మాతల మండలి) ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ప్రతిష్టపై మీడియాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులతో కలత చెందుతున్నామని.. మీడియా మంటలను ఆపాలని లేఖలో పేర్కొంది.

ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఈ లెటర్ లో యువ హీరో విషాదాంతాన్ని సినీ ఇండస్ట్రీతో పాటు ఇండస్ట్రీ సభ్యుల ప్రతిష్టను దిగజార్చేలా వాడుకుంటున్నారని.. ఇండస్ట్రీని భయంకరమైనదిగా చిత్రీకరించారని పేర్కొంది. సినీ ఇండస్ట్రీ అంటే అవుట్ సైడర్స్ కి భయానకమైన ప్లేస్ అని.. మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు క్రిమినాలిటీ యొక్క మురికి అని చిత్రీకరించారని.. కానీ ఇదంతా అబద్దమని.. ఇది మీడియాకి రేటింగ్స్ పెరగడానికి పాఠకులు వీక్షకులు పెరగడానికి దోహద పడుతుందని చెప్పుకొచ్చింది. ప్రతి రంగంలో మాదిరే సినీ పరిశ్రమలోనూ లోటు పాట్లు ఉండొచ్చని.. వీటిని సరైన దిశలో చక్కదిద్దుకోవచ్చని.. ఒక్క తప్పుని ఇండస్ట్రీ అంతటికి ఆపాదించడం కరెక్ట్ కాదని పేర్కొంది.

అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ ఎంతో మందికి ఉపాధి కల్పించడంతో పాటు కొన్నేళ్ల నుండి ప్రేక్షకులకు వినోదం అందిస్తోందని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ పేర్కొంది. హాలీవుడ్‌ ప్రభావాన్ని తట్టుకుని ఇతర భాషా సినీ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌ నిలదొక్కుకుందని.. ఆపద సమయాల్లో ఇండస్ట్రీ దేశ ప్రజలకు అండగా నిలిచిందని గుర్తు చేసింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి టాలెంట్ కి బాలీవుడ్‌ స్వాగతించిందని.. న్యూ టాలెంట్ ని ఇండస్ట్రీ అడ్డుకుంటుందని ప్రచారం చేయడం అవాస్తవమని తెలిపింది. ఇండస్ట్రీకి సంబంధం లేని ఎంతోమంది ఫిల్మ్‌ ప్రొఫెషనల్స్‌ పరిశ్రమలో నిలదొక్కుకున్నారని చెప్పింది. యాక్టర్స్, డైరెక్టర్స్, రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, కెమెరామెన్లు, ఎడిటర్లు, ప్రొడక్షన్‌ డిజైనర్లు, ఆర్ట్‌ డైరెక్టర్లు, కాస్ట్యూమ్‌ డిజైనర్లు వంటి ఎందరో ప్రొఫెషనల్స్‌ సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఎదిగారని.. సినీ పరిశ్రమలో కొత్తవారు నెగ్గుకురాలేరని మీడియాలోనూ తప్పుదారిపట్టించే వార్తలు వస్తుండటం బాధాకరమని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ లేఖలో పేర్కొంది. మీడియా మంటలు ఆపాలని.. రేటింగ్స్ రెవిన్యూ కంటే ఇంపార్టెంట్ వి చాలా ఉన్నాయని పేర్కొంది.