Begin typing your search above and press return to search.
ఓటీటీ రెవెన్యూ షేరింగ్ విధానంలో నిర్మాతల లెక్క తప్పుతోందా...?
By: Tupaki Desk | 19 Sep 2020 5:31 PM GMTకరోనా కారణంగా గత ఆరున్నర నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్స్ లు మూతబడి ఉన్న విషయం తెలిసిందే. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదని భావించిన ఫిలిం మేకర్స్ తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లలో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు డిజిటల్ వేదికలపై విడుదలయ్యాయి. లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనాలు భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో వచ్చే కంటెంట్ ని చూస్తున్నారు. ఓటీటీలకు ఆదరణ పెరుగుండటంతో కొన్ని నిర్మాణ సంస్థలు తమ సినిమాలను ప్రముఖ ఓటీటీలలో రెవెన్యూ షేరింగ్ విధానంలో విడుదల చేస్తూ వచ్చారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. కానీ కొంతమంది నిర్మాతలు ఏ సినిమా ఎంత ప్రభావం చూపిస్తుందో అనేది అంచనా వేయకుండా.. ఇతర నిర్మాణ సంస్థల దగ్గర ఎక్కువ మొత్తంలో సినిమాలు కొనుక్కొని ఓటీటీలలో రెవెన్యూ షేరింగ్ విధానంలో రిలీజ్ చేస్తూ నష్టాలు కొని తెచ్చుకుంటున్నారని తెలుస్తోంది.
కాగా, టాలీవుడ్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న రెండు చిన్న సినిమాలను ఓ నిర్మాణ సంస్థ ఫ్యాన్సీ రేట్ కి ఒరిజినల్ నిర్మాతల దగ్గర తీసుకొని థియేట్రికల్ రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాలు పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడంతో ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ కాలేదు. అదే సమయంలో కరోనా రావడం వల్ల థియేటర్ రన్ లేకుండా పోయి రెవెన్యూ తగ్గిపోయింది. దీంతో సదరు నిర్మాతలు కొంతమేర నష్టపోయారని టాక్. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీలో ఈ సినిమాల్ని రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో విడుదల చేశారు. దీని కోసం పబ్లిసిటీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాలను ఆల్రెడీ పైరసీ రూపంలో చూసేయడం వల్ల స్ట్రీమింగ్ కి పెట్టి నాలుగు నెలలు కావాస్తున్న ఆశించినంత స్థాయిలో ఓటీటీ రెవెన్యూ రాలేదని టాక్ నడుస్తోంది. దీని వల్ల సదరు నిర్మాతలు నష్ట పోవాల్సి వచ్చింది. అందుకే సినిమా మార్కెట్ ని బట్టి ఓటీటీ రెవెన్యూ షేరింగ్ పద్ధతికి వెళ్తే బాగుంటుందని ట్రేడ్ నిపుణులు సూచిస్తున్నారు.