Begin typing your search above and press return to search.

స‌చివాల‌యంలో మంత్రి పేర్నితో నిర్మాత‌ల భేటీ

By:  Tupaki Desk   |   29 Oct 2021 8:31 AM GMT
స‌చివాల‌యంలో మంత్రి పేర్నితో నిర్మాత‌ల భేటీ
X
గ‌త కొంత‌కాలంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టిక్కెట్టు రేటు పెంపుపై నిర్మాత‌లు మంత్రి పేర్ని నానీతో చ‌ర్చ‌లు సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. టికెట్ పెంపుపై నేడు క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిన్న‌టిరోజున కేబినెట్ భేటీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆన్ లైన్ పోర్ట‌ల్ స‌హా టిక్కెట్టు రేట్ల‌పై చ‌ర్చించింది.

ఇంత‌లోనే మంత్రి పేర్ని నానీతో నేడు దిల్ రాజు స‌హా ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు భేటీ అవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నేడు సచివాలయంలో మంత్రి పేర్ని తో దిల్‌ రాజు- అలంకార్‌ ప్రసాద్ త‌దిత‌ర నిర్మాత‌లు స‌మావేశ‌మ‌య్యారు.

ఈ స‌మావేశంలో ఏం చ‌ర్చించారు? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. సినీప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌తో పాటు టికెట్ రేట్ల‌పై కీల‌కంగా చ‌ర్చించ‌నున్నార‌ని తెలుస్తోంది. అలాగే ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ప‌నితీరు గురించి కూడా క్లారిటీ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం మా నుంచి కొంత స‌మాచారం కోరింది. దానిని ఇచ్చేందుకు మంత్రిని క‌లిసామ‌ని దిల్ రాజు పేర్కొన్నారు.

ప్ర‌భుత్వ టికెటింగ్ పోర్ట‌ల్ అంద‌రికీ ఓకేనా?

ఇక‌పై ప్ర‌భుత్వ పోర్ట‌ల్ లోనే ప్రేక్ష‌కులు టిక్కెట్లు కొని సినిమా థియేట‌ర్ కి వెళ్లాలి. బ్లాక్ మార్కెటింగ్ దందాని పూర్తిగా బంద్ చేయ‌నున్నారు. ఆ మేర‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నిన్న‌టిరోజున‌ సమావేశమై అనేక కీలక నిర్ణయాల గురించి చర్చించింది. ఆంధ్ర ప్రభుత్వంచే నిర్వహించబడే కొత్త సినిమా టికెటింగ్ పోర్టల్ పైనా క్లారిటీ ఇచ్చారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. త్వరలో పోర్టల్ అమల్లోకి వస్తుంది. టిక్కెట్ విక్రయాల గురించిన కొత్త మార్గదర్శకాలతో పాటు కొత్త టిక్కెట్ ధర జీవో అతి త్వరలో విడుదల కానున్నాయి. ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ఆమోద‌యోగ్యమేనా కాదా? అన్న‌దానిపై ఏపీ మంత్రి పేర్ని నాని ప‌లుమార్లు సినీపెద్ద‌ల‌తో చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో టిక్కెట్ల పోర్టల్ గురించి ఆయ‌న అభిప్రాయాన్ని సేకరించారు. దీనికి నిర్మాత‌ల నుంచి మ‌ద్ధ‌తు ల‌భించింది. బ‌హుశా పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ విష‌యం టిక్కెట్టు పెంపు విష‌యంలోనే నేడు దిల్ రాజు త‌దిత‌రులు పేర్నితో చ‌ర్చించార‌ని భావిస్తున్నారు. అలాగే నిన్న‌టి రోజున కేబినెట్ భేటీ అనంత‌రం కింగ్ నాగార్జున సీఎం జ‌గ‌న్ ని క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా మాత్ర‌మే క‌లిసార‌ని మంత్రి నానీ తెలిపారు.

ఐదో షోకి అనుమ‌తులు ఇస్తారా?

ఆంధ్రప్రదేశ్ లో ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారంతో పాటు నాలుగు షోలకు పర్మిషన్, ..అలాగే వందశాతం సీటింగ్ ఆక్యుపెన్సీ లాంటి పలు విషయాల గురించి ఎపి మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు భేటీ అవ్వ‌గా చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ఓ మారు ఏపీ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ఎగ్జిబిటర్లు,..ప్రతినిధులు మంత్రి పేర్నినానితో చర్చలు జరిపారు. టాలీవుడ్‌ ఎదుర్కొంటున్న సమస్యలు ..ఇబ్బందులపై చర్చించారు. పరిష్కారం చూపించాలని కోరగా ఏపీ ప్ర‌భుత్వం వంద శాతం ఆక్యుపెన్సీకి ప‌ర్మిష‌న్ ఇచ్చింది. అయితే ఏపీలో ఐదో షోగా చిన్న సినిమాకి అవ‌కాశం క‌ల్పిస్తారా? అన్న‌ది వేచి చూడాలి. బ‌హుశా ఏపీ హిస్ట‌రీలోనే ఇన్నిసార్లు సినిమా రంగం గురించి మంత్రి వ‌ర్యుల‌ను సినీపెద్ద‌లు క‌ల‌వ‌డం ఇదే తొలిసారి. ఇండ‌స్ట్రీ క‌ష్టాల‌న్నిటినీ ప‌రిష్క‌రించే దిశ‌గా మంత్రి నుంచి పాజిటివ్ స్పంద‌న‌లు రావ‌డం విశేషం. టిక్కెట్టు ధ‌ర‌ల పెంపుపై నిర్ణ‌యం వెలువ‌డితో అన్నివ‌ర్గాల నుంచి హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. కానీ ఇదొక్క‌టీ అంత సులువేమీ కాద‌ని చెబుతున్నారు. దీనికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.