Begin typing your search above and press return to search.
బంద్ పై ప్రొడ్యూసర్ల రియాక్షన్ ఎలా వుంది?
By: Tupaki Desk | 3 Aug 2022 2:30 PM GMTఆగస్టు 1 నుంచి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ షూటింగ్ లని బంద్ చేయాలని సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పారితోషికాలు, ఓటీటీ రిలీజ్‌లు, అనవరస ఖర్చులని తగ్గించుకుని బడ్జెట్ లని అదుపులో చేయడం, వీపీఎన్ (వర్చువల్ ప్రింట్ నెట్ వర్క్) ఛార్జెస్ వంటి కీలక అంశాలని పరిగణలోకి తీసుకని తాజా బంద్ కు పిలుపు నిచ్చారు. అయితే బంద్ అనుకున్న విధంగా జరగడం లేదని కొంత మంది వాదిస్తున్నారు.
బంద్ అని చెబుతూనే కొంత మంది స్టార్ హీరోలతో నిర్మిస్తున్న సినిమాల షూటింగ్ లని యధేశ్చగా జరుపుకుంటున్నారని వాపోతున్నారు. మరి కొంత మంది మాత్రం ప్రతీ సినిమా షూటింగ్ నిలిపివేయాల్సిందేనని, ఆర్టిస్ట్ లు, స్టార్ హీరోల పారితోషికాల తగ్గించుపై చర్చించాల్సిందేనని చెబుతున్నారు. కొంత మంది స్టార్ హీరోల రెమ్యునరేషన్ లపై స్పందించడానికి వెనకాడుతుంటతే మరి కొంత మంది నిర్మాతలు మాత్రం ఈ విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి తాము సిద్ధమేనని స్పష్టం చేస్తున్నారు.
ఇదిలా వుంటే ముందు నుంచి గిల్డ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న సీనయర్ నిర్మాతలు మాత్రం గత కొన్ని రోజులుగా జరుగుతున్న సమావేశాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు సంతృప్తికరంగా లేకపోవడంతో కాస్త గుర్రుగానే వున్నారట. ఇటీవల సి. అశ్వనీదత్, బండ్ల గణేష్ వంటి కొంత మంది నిర్మాతలు గిల్డ్ నిర్ణయంపై బాహాటంగానే నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. తాజా సమావేశాల్లో వీరు కనిపించకుండా దూరంగా వుంటున్నారట.
ఇక షూటింగ్ లని బంద్ చేయాల్సిందే అంటూ గిల్డ్ లో కీలక అంశాన్నిలేవనెత్తిన దిల్ రాజు తను తమిళ హీరో విజయ్ తో నిర్మిస్తున్న 'వారసుడు' సినిమా షూటింగ్ ని ఎలాంటి ఆటంకం లేకుండా జరిపిస్తుండటం, అడిగితే తమిళ సినిమా అది అని లాజిక్ లు చెబుతుండటం, ఇదే తరహాలో మరో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా ధనుష్ తో నిర్మిస్తున్న 'సార్' మూవీ షూటింగ్ ని నిలిపివేయకుండా కంటిన్యూ చేస్తుండటంతో చాలా మంది నిర్మాతలు వీరిద్దరిపై మండి పడుతున్నారట.
ఇటీవల ప్రొడ్యూసర్స్ గిల్డ్ కి సంబంధించిన నిర్ణయాలతో పాటు నిర్మాతల మండలికి సంబంధించిన కీలక సమావేశాల్లో మాట్లాడుకున్న కీలక అంశాలని కొంత మంది మీడియాకు లీక్ చేశారు. అది ఎవరన్నది మిగతా నిర్మాతలకు తెలిసినా ఆ విషయం తాజాగా బయటపెట్టడానికి ఆసక్తి చూపించకపోవడం గమనార్హం.
దీనిపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ కి సంబంధించిన కీలక సమావేశం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. ఇందులో మొత్తం షూటింగ్ లని బంద్ చేయాల్సిందేనని పలువురు నిర్మాతలు పట్టుబట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.