Begin typing your search above and press return to search.
స్టార్ హీరో పారితోషికం ఎగ్గొట్టారా?
By: Tupaki Desk | 4 Sep 2019 8:46 AM GMTఇటీవల ఓ ముగ్గురు స్టార్ హీరోలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ ముగ్గురిపైనా వినిపిస్తున్న రకరకాల రాంగ్ రీజన్స్ అభిమానుల్ని కలవరపెడుతున్నాయి. అయితే ఆ ముగ్గురూ తమిళ హీరోలు కావడం కోలీవుడ్ రాజకీయాల్లో రాటు దేలిన వారే అన్నది ఇక్కడ పరిశీలించదగ్గది. స్టార్ హీరోలు శింబు- ధనుష్- విశాల్ .. ఈ ముగ్గురిపైనా పరిశ్రమలో రకరకాల నెగెటివ్ కామెంట్లు వైరల్ గా మారాయి.
హీరో శింబుకి క్రమశిక్షణ లేదని.. నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంటాడని చాలా కాలంగా బ్యాడ్ బోయ్ ఇమేజ్ ఉంది. ఇప్పటికీ అతడిలో మార్పు లేదన్న రిపోర్ట్ ఉంది. అతడి క్రమశిక్షణా రాహిత్యం వల్లనే కెరీర్ నాశనమైందన్న ముచ్చటా సాగుతోంది. ఇక నడిగరసంఘం- కోలీవుడ్ నిర్మాతల మండలి రాజకీయాల్లో హీరో విశాల్ పై ప్రత్యర్థుల పట్టు బిగిస్తుండడం కోర్టుల పరిధిలో అతడిపై వ్యతిరేక పవనాలు వీయడంతో తనపైనా నెగెటివ్ కామెంట్లు వినిపించాయి.
లేటెస్టుగా మరో స్టార్ హీరో ధనుష్ పైనా రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ నిర్మాతలపై ధనుష్ చేసిన ఓ కామెంట్ విమర్శలకు తావిచ్చింది. ``నిర్మాతల నుంచి పారితోషికాలు వసూలు చేయడం చాలా కష్టంగా ఉంది. దానికోసం బోలెడంత విలువైన సమయం వృథా అవుతోంది!`` అంటూ వ్యాఖ్యానించడంతో అతడిపై నిర్మాతల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందట. ``ధనుష్ నటించే సినిమాలతో లాభాలు రావడం లేదు. చాలా వరకూ నష్టాలే వస్తున్నాయి`` అంటూ నిర్మాతలు ఎదురు దాడికి దిగారు. ఈ కామెంట్ చేసి ధనుష్ అనవసరంగా తప్పు చేశాడా? అంటూ అభిమానుల్లో ముచ్చటా సాగుతోంది. ధనం ఇదం జగత్! ధనస్వామ్యం రాజ్యమేలే చోట చివరకు మిగిలేది ఏదీ? అంటే ఇలాంటి రాజకీయాలేననడంలో సందేహం లేదు. అయితే క్రమశిక్షణ లేని ఆర్టిస్టులకు ఎక్కడైనా ఒకటే పూజ్యం ఉంటుందనడంలో ఏ సందేహం లేదు. ట్యాలెంటు ఉన్నా క్రమశిక్షణ లేని స్టార్ గా శింబుపై చాలా కాలంగా శని ప్రభావం కనిపిస్తోంది. ఇక నిర్మాతలకు సహకరించని హీరోల జాబితాలో ధనుష్ పేరును తాజాగా చేర్చారు. అయితే ఈ రొంపిలోకి విశాల్- ధనుష్ లాంటి క్రమశిక్షణ - ప్రతిభ ఉన్న స్టార్ల పేర్లు కూడా వినిపించడమే అభిమానులను కంగారు పెడుతోంది.