Begin typing your search above and press return to search.

కామెంట్: బ్యానర్లకు కూడా అద్దె వసూలు

By:  Tupaki Desk   |   23 Nov 2016 10:30 PM GMT
కామెంట్: బ్యానర్లకు కూడా అద్దె వసూలు
X
దేశంలో బాలీవుడ్ తర్వాత అతి పెద్ద మూవీ మార్కెట్ టాలీవుడ్. దాదాపు హిందీ సినిమాల సంఖ్యలోనే ఇక్కడ కూడా మూవీస్ వచ్చేస్తుంటాయి. అది కూడా కేవలం రిలీజ్ అయిన వాటిని మాత్రమే లెక్కిస్తేనే. అలా కాకుండా ఔత్సాహికులు తీయగా.. రిలీజ్ కు నోచుకోక ఆగిపోయే వాటి సంఖ్య కూడా కలిపితే ఇంకా ఎక్కువగానే కౌంట్ ఉంటుంది. ఇలాంటి సినిమాలకు ఈ మధ్య పెద్ద బ్యానర్ల అండ దొరుకుతోంది.

కంటెంట్ బాగున్న సినిమాలను పెద్ద నిర్మాతల అండతో రిలీజ్ చేస్తున్నారు. పెద్ద బ్యానర్ పేరు ఎంటర్ అవడంతో డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో ధైర్యంగా పెద్ద మొత్తం ఖర్చు చేయగలగుతున్నారు. ఇది అటు ఒరిజినల్ నిర్మాతకు.. ఇటు బడా ప్రొడ్యూసర్ కు ఇద్దరికి మంచి లాభాలను తీసుకొచ్చే వ్యవహారం కావడం.. మంచి సినిమాకు అండగా నిలబడ్డారనే పేరు పెద్ద బ్యానర్ల ఓనర్లకు వస్తుండడంతో ఈ జోరు కొనసాగుతోంది.

ఇప్పుడీ కల్చర్ కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే కాకుండా.. ఈ పద్ధతిని చిన్నా చితకా మార్పులతో పక్క భాషల సినిమాలకు కూడా అప్లై చేస్తున్నారు. తెలుగులో మార్కెట్ పెంచుకునేందుకు.. క్రియేట్ చేసుకునేందుకు ట్రై చేసే హీరోలు.. నిర్మాతలకు.. ఇక్కడి బడా బ్యానర్లు తోడు నిలుస్తున్నాయి. 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకూ పుచ్చుకుని.. తమ బ్యానర్ వాల్యూను వాడుకునేందుకు అనుమతులు ఇచ్చేస్తున్నారు.

ఇక్కడ ఖర్చంతా ఒరిజినల్ ప్రొడ్యూసర్లదే ఉంటోంది. ప్రమోషన్ కోసం కూడా పెద్ద మొత్తాన్నే వెచ్చిస్తున్నారు. కానీ అదంతా ఈ బ్యానర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అటు మార్కెట్ పెంచుకునేందుకు చేసే ప్రయత్నానికి.. ఈ బడా నిర్మాతలు అండగా నిలుస్తున్నారు. వీరికి అసలేమీ పని లేకుండానే.. అంటే కేవలం బ్యానర్ ను అద్దెకిచ్చేస్తే.. పెద్ద మొత్తంలో వచ్చి పడుతోంది.

అటు తమిళ్.. కన్నడ మేకర్స్ కు కూడా తేలికగా ఎంట్రీ దొరుకుతోంది. కాకపోతే.. ఇలా బ్యానర్ ను అద్దెకిచ్చిన నిర్మాతలు ఆ మూవీ మేకర్స్ ఏర్పాటు చేసే ఫంక్షన్స్ కు హాజరు కావాల్సి ఉంటుందంతే. ఆడియో రిలీజ్ .. ప్రెస్ మీట్స్.. సక్సెస్ మీట్ తరహాలో నాలుగైదు ఈవెంట్స్ కు హాజరైతే.. కోట్లు వచ్చి పడుతున్నాయ్ కదా. మొత్తానికి ఈ బ్యానర్ రెంటల్ వ్యాపారం టాలీవుడ్ నిర్మాతలకు బాగానే కలిసొస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/