Begin typing your search above and press return to search.
నాని వెనకే దాగి నితిన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
By: Tupaki Desk | 11 Aug 2021 11:32 AM GMTఏపీలో టిక్కెట్టు ధరల సమస్య ఒకవైపు క్లియర్ కాలేదు. సాయంత్రం షోల విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు అంటూ భయాందోళనలు నెలకొన్నాయి. ఇటు తెలంగాణలో టిక్కెట్టు సమస్య లేకపోయినా ప్రభుత్వం తరపున కొన్ని వెసులుబాట్లు ఆశిస్తున్నా వాటికి లైన్ క్లియరవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఇలాంటి రకరకాల కారణాలతో నిర్మాతలు తమ సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అక్టోబర్ వరకూ వేచి చూడాలన్న తెలంగాణ ఫిలింఛాంబర్ పెద్దల పిలుపును కూడా పట్టించుకునే పరిస్థితి లేదిప్పుడు.
డి.సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత తనదారిలో తాను వెళుతున్నారు. వెంకీ నటించిన నారప్పను ఆయన ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇది ఘనవిజయం సాధించింది. మరోవైపు విరాటపర్వం- దృశ్యం 2 చిత్రాలను కూడా ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే సురేష్ బాబును అనుసరించి ఇతర నిర్మాతలు కూడా ఓటీటీ రిలీజ్ ల వైపు మొగ్గు చూపడమే చిక్కులు తెచ్చిపెడుతోంది.
తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాత లక్ష్మణ్ డీల్ కుదుర్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిని తెలంగాణ ఛాంబర్ పెద్దలు నిలదీస్తున్నారు. ఎగ్జిబిటర్ల తరపున మాట్లాడిన నాని అందుకు ఎలా ఒప్పుకున్నారు? అంటూ తనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే పంపిణీదారులతో కుదుర్చుకున్న ఒప్పందాలను క్యాన్సిల్ చేయడంపై లక్ష్మణ్ పై అంతా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇలా అయితే థియేట్రికల్ రంగం ఏమవ్వాలి? అంటూ అతడిని అందరూ నిలదీస్తున్నారు.
మరోవైపు నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు శ్రేష్ఠ్ సంస్థ ప్రయత్నాల్లో ఉంది. కానీ అక్టోబర్ కండీషన్ వల్ల కాస్త వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నారని తెలిసింది. కొద్దిగా పరిస్థితి సద్దుమణిగాక ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించాలన్నది ప్లాన్. మరోవైపు రానా - విరాటపర్వం.. వెంకీ-దృశ్యం 2 చిత్రాల రిలీజ్ తేదీలను సురేష్ బాబు ప్రకటించాల్సి ఉంది. ఇవన్నీ ఒకేసారి తేదీల్ని లాక్ చేస్తే ఎగ్జిబిటర్ల నుంచి తీవ్ర నిరసన ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. దీనిపై మునుముందు సన్నివేశం ఎలా ఉంటుందోనన్న చర్చా హీటెక్కిస్తోంది.