Begin typing your search above and press return to search.

షూటింగులకు పర్మిషన్ వచ్చింది. కానీ...!

By:  Tupaki Desk   |   18 Jun 2020 12:50 PM GMT
షూటింగులకు పర్మిషన్ వచ్చింది. కానీ...!
X
సినీ ఇండస్ట్రీ గత రెండున్నర నెలలుగా మూతబడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు సినిమా షూటింగులకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతిస్తూ వస్తున్నాయి. కాకపోతే కొన్ని షరతులు నిబంధనలతో మాత్రమే చిత్రీకరణకు అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా సీరియల్స్ మరియు సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చని ప్రభుత్వాలు జీవోలు జారీ చేసాయి. దీంతో షూటింగ్స్ ఆపేసుకున్న చిత్రాలు చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. అయితే షూటింగ్స్ కి అనుమతిస్తున్నా పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ వలన చిత్రీకరణ ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది ప్రశ్నర్థకంగా మారింది. ఎందుకంటే రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అంటే మాములు విషయం కాదని కొంతమంది ప్రొడ్యూసర్స్ అభిప్రాయపడుతున్నారట. అంతేకాకుండా హడావిడిగా చిత్రీకరణ స్టార్ట్ చేసి రిస్క్ తీసుకోకూడదని అనుకుంటున్నారట. మరికొన్ని రోజులు వేచి చూసే ధోరణి అవలంభించి.. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే షూటింగ్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారట.

అయితే షూటింగ్స్ స్టార్ట్ అవకపోతే సినిమా థియేటర్స్ కూడా ఇప్పట్లో రీ ఓపెన్ అయ్యే అవకాశాలు లేవంటున్నారు విశ్లేషకులు. ఇది ఇలానే కొనసాగితే ఈ ఏడాది మొత్తం థియేటర్స్ క్లోజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు సగానికి పైగా షూటింగ్స్ కంప్లీట్ చేసుకొని ఉన్నారు. ఇవన్నీ దాదాపుగా ఫెస్టివల్ సీజన్ ని టార్గెట్ చేసుకుని వస్తున్న సినిమాలే. అయితే ఈ చిత్రాలు షూటింగ్స్ కంప్లీట్ చేయకపోతే థియేటర్స్ తెరచినా లాభం ఉండదు. ఇప్పటికే కంప్లీట్ అయి రిలీజ్ కి రెడీ అయిన సినిమాల సంఖ్య తక్కువే ఉంది. వాటిలో కూడా చాలా మూవీస్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటే వచ్చే ఏడాది ప్రారంభంలో మాత్రమే థియేటర్స్ పునః ప్రారంభయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. దీంతో ఈ సమయాన్ని హీరోలు కొత్త స్క్రిప్ట్స్ ని లైన్లో పెట్టుకునే పనిలో ఉన్నారు. ఇక డైరెక్టర్స్ తమ ఆలోచనలకు పదును పెట్టి న్యూ స్క్రిప్ట్స్ రెడీ చేసుకుంటున్నారట. కొంతమంది ప్రొడ్యూసర్స్ షూటింగ్స్ యధావిధిగా స్టార్ట్ అయినా మూవీస్ ని పక్కన పెట్టి వెబ్ సిరీస్ మరియు వెబ్ బేస్డ్ కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలని చూస్తున్నారట. ఇప్పటికే పలు ఓటీటీలతో డిస్కషన్ కూడా స్టార్ట్ చేశారట. మరి రాబోయే రోజుల్లో సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.