Begin typing your search above and press return to search.

వామ్మో.. బిలియన్ డాలర్లతో అవతార్

By:  Tupaki Desk   |   28 Sept 2017 3:32 PM IST
వామ్మో.. బిలియన్ డాలర్లతో అవతార్
X
ప్రపంచ సినిమా స్థాయిని మార్చేసిన మూవీ అవతార్. జేమ్స్ కేమరాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. విడుదలైన ప్రతీ చోటా వసూళ్ల వర్షం కురిపించేసింది. దాదాపు 1600 కోట్ల రూపాయల ఖర్చుతో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసేసింది. భారీ బడ్జెట్ మూవీస్ లో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్.. చరిత్రలో కనిపించడం బహు అరుదు.

ఈ అవతార్ కు సీక్వెల్స్ పై చాలా కాలం నుంచి మాటలు వినిపిస్తున్నాయి. అప్పటి మాటల ప్రకారం అయితే.. ఈపాటికే అవతార్ 2 సెట్స్ పై ఉండాలి. కానీ బడ్జెట్ తో పాటు ఇతర కారణాల దృష్ట్యా ఇంకా సీక్వెల్ పనులు పూర్తి స్థాయిలో మొదలుకాలేదు. ఇప్పుడు అవతార్ సీక్వెల్ విషయంలో దర్శకుడి నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. అవతార్ కు ఏకంగా నాలుగు సీక్వెల్స్ వస్తాయని చెప్పేశాడు జేమ్స్ కేమరాన్. అంటే.. అవతార్ 2..3..4..5 కూడా రాబోతోన్నాయన్న మాట. ఇంకా వీటి షూటింగ్ మొదలు కాలేదు కాబట్టి.. అప్పుడే రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడుకోవడం హాస్యాస్పదమే. అయితే.. ఈ నాలుగు భాగాలను రూపొందించేందుకు ఇప్పటికి అనుకుంటున్న బడ్జెట్ వింటేనే.. గుండె గుభేలు మంటుంది.

వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్.. మన కరెన్సీలో అయితే 6500 కోట్ల రూపాయలను ఖర్చు చేసి సీక్వెల్స్ తీసేస్తారట. అసలు ఇంతటి ప్రాజెక్ట్ తలపెట్టడమే మహా సాహసం. మన ఇస్రోవాళ్లు మార్స్ మిషన్ కు పెట్టిన ఖర్చు కంటే ఇది 20 రెట్లు ఎక్కువ అంటే ఆశ్చర్యం వేయక మానదు. ఈ నాలుగు సీక్వెల్స్ కు సంబంధించిన పనులు ఏకకాలంలోనే జరగనుండగా.. సినిమాలను కూడా ఏడాదికొకటి చొప్పున విడుదల చేసే అవకాశాలున్నాయట.