Begin typing your search above and press return to search.

ఆ హీరోకి ఆ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ వంద కోట్ల సింగిల్ చెక్ ఇచ్చిందా?

By:  Tupaki Desk   |   7 Sep 2022 3:30 PM GMT
ఆ హీరోకి ఆ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ వంద కోట్ల సింగిల్ చెక్ ఇచ్చిందా?
X
స్టార్ హీరో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకోగానే చాలా మంది స్టార్ ప్రొడ్యూస‌ర్స్ కోట్ల‌ల్లో అడ్వాన్స్ లు ఇస్తూ స్టార్ హీరోల వెంట ప‌డుతుంటారు. అలా అడ్వాన్స్ లు తీసుకున్న హీరోలు ఎప్ప‌టికో కానీ టైమ్, స‌రైన స్క్రిప్ట్ ల‌భించి అందుకు త‌గ్గ డైరెక్ట‌ర్ కుదిరిన‌ప్పుడు తీసుకున్న అడ్వాన్స్ ల‌కు సినిమాలు చేస్తూ వుంటారు. ఇది టాలీవుడ్ లో గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా జ‌రుగుతున్న‌దే. ఇదే ఫార్ములాని స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఇప్ప‌టికీ ఫాలో అవుతూనే వున్నారు.

ఇదే త‌ర‌హాలో ఓ క్రేజీ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ వంద కోట్ల సింగిల్ చెక్ ని ఇవ్వ‌డం ఇప్ప‌డు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అంద‌రు నిర్మాత‌ల్లాగే స‌ద‌రు స్టార్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ అధినేత సింగిల్ చెక్ లో వంద కోట్లు స్టార్ హీరోకు అడ్వాన్స్ రెమ్యున‌రేష‌న్ కింద ఇవ్వ‌డం ఇండ‌స్ట్రీలో కొత్త చ‌ర్చ‌కు దారి తీసింది.

వంద‌ల కోట్ల సినిమాతో తెలుగు సినిమా ద‌శ‌ని దిశ‌ని మార్చిన హీరో.. తెలుగు సినిమా క్రేజ్ ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లి ప్ర‌తి సినిమాకు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి మార్కెట్ ని సృష్టించిన హీరో.

ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా బిజీ బిజీగా గ‌డిపేస్తున్నాడు. మూడు పాన్ ఇండియా మూవీస్ తో సంచ‌ల‌నం సృష్టిస్తున్న స‌ద‌రు స్టార్ హీరో త్వ‌ర‌లో క్రేజీ డైరెక్ట‌ర్ తో హార‌ర్ థ్రిల్ల‌ర్ ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీని ముందు ఓ స్టార్ ప్రొడ్యూస‌ర్ నిర్మిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

అయితే ద‌ర్శ‌కుడికున్న ట్రాక్ రికార్డ్ దృష్ట్యా అత‌న్ని న‌మ్మి వంద‌ల కోట్ల బ‌డ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని చేయ‌లేన‌ని త‌ప్పుకున్నాడ‌ట‌. అయితే అత‌ని స్థానంలో లైన్ లోకి వ‌చ్చిన క్రేజీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్టార్ హీరోతో హార‌ర్ థ్రిల్ల‌ర్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం వెంట‌నే స్టార్ హీరోకు వంద కోట్ల సింగిల్ చెక్ ని అందించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇదే ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఓ స్టార్ ప్రొడ్యూస‌ర్ వ‌దులుకున్న ప్రాజెక్ట్ కోసం ముందుకొచ్చిన‌ స‌ద‌రు సంస్థ ఉన్న ప‌లంగా హీరోకు వంద కోట్ల‌ సింగిల్ చెక్ ని ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇటీవ‌లే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాల్నిలాంఛ‌నంగా పూర్తి చేశారు. కానీ ఒక్క ఫొటో కూడా బ‌య‌టికి రాలేదు. రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కితే గానీ అస‌లు విష‌యం బ‌య‌టి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.