Begin typing your search above and press return to search.
సినిమాకు పేరు వచ్చింది కానీ.. ఆర్ట్ డైరెక్షన్ కు పేరు రాలేదు..!
By: Tupaki Desk | 16 Dec 2021 4:30 PM GMTనేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''శ్యామ్ సింగ రాయ్''. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్ తో నిర్మించారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...
* 'శ్యామ్ సింగరాయ్' లో రెండు కథలుంటాయి. ఒకటి ప్రజెంట్ గా.. ఇంకోటి 70వ దశకంలో బెంగాల్ లో జరుగుతుంది. అప్పటి పరిస్థితులను చూపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు మూడేళ్ల పాటు దీనిపై రీసెర్చ్ చేశాం. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో బెంగాల్ లోనే ఉండిపోయాను. సౌత్ - నార్త్ ఒకరకమైతే.. బెంగాల్ లో మరోలా ఉంటుంది. అక్కడి ఆర్కిటెక్చర్ - టెంపుల్స్ అన్నింటిపై పరిశోధించాను.
* సినిమా కోసం అన్ని సెట్స్ హైద్రాబాద్ లోనే వేశాం. ట్రైలర్ లో ఓ ప్రింటింగ్ ప్రెస్ కనిపిస్తుంది. దాని కోసం చాలా కష్టపడ్డాం. అప్పుడు వాడిన పేపర్ - టెక్స్ట్ ఇలా అన్నింటి గురించి తెలుసుకున్నాం. ఆ సమయంలో ఉన్న వాటిని తెలుసుకుని, కొన్నింటిని రీక్రియేట్ చేశాం. ఈ సినిమాకు సంబంధించిన అతి పెద్ద టెంపుల్ సెట్ వేశాం. అందులో మేజర్ సీన్స్ తెరకెక్కించారు. టెంపుల్ సెటప్ మేజర్ హైలెట్ అవుతుంది. ఆరు ఎకరాల్లో వేసిన ఆ సెట్ కోసం మూడు నెలల పాటు, రోజూ మూడొందల మంది శ్రమించారు.
* కోల్ కతా నేపథ్యంలో సినిమా రాబోతోందనే విషయమే నాకు ఎగ్జైటింగ్ గా అనిపించింది. అక్కడి కల్చర్ ఇండియాలో ఎక్కడా కనిపించదు. దేవదాసీలకు సంబంధించిన టెంపుల్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం కేవలం ఊహించగలం. కథకు తగ్గట్టు ఊహించుకుని ఆ సెట్ వేశాను. ఈ సినిమా కోసం సత్యజిత్ రే చిత్రాలను రిఫరెన్స్ గా తీసుకున్నాను. కానీ అవన్ని బ్లాక్ అండ్ వైట్ లోనే ఉన్నాయి. దాని వల్ల అంతగా ఉపయోగం ఏమీ లేదు.
* ఎంత ఖర్చు పెడుతున్నారు.. ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని నిర్మాత ఏనాడూ నన్ను ప్రశ్నించలేదు. ఇలాంటి సినిమాలకు అలాంటి నిర్మాతలే ఉండాలి. అలాంటప్పుడే కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్ పుట్ తీసుకురాగలం.
* ఆర్ట్ వర్క్ తో పాటు కెమెరా పనితనం కూడా చాలా ముఖ్యం. కొన్ని సార్లు ఆర్ట్ వర్క్ కు గుర్తింపు వస్తుంది.. కొన్ని సార్లు రావు. 'జెర్సీ' సినిమాకు పేరు వచ్చింది. కానీ ఆర్ట్ డైరెక్షన్ కు పేరు రాలేదు. అందులో వేసినవి సెట్స్ అని ఎవరికీ తెలియవు. మనం ఒక రూపాయి ఖర్చు పెట్టినా కూడా మా కెమెరామెన్ దాన్ని చూపిస్తారు.
* టెంపుల్ సెట్ ను ఇండస్ట్రీలో చాలా మంది చూశారు. ఇంత డీటైలింగ్ గా ఎందుకు వేశారు.. దర్శకుడు చెప్పారని ఇలా వేశారా? మీరు వేశారని డైరెక్టర్ తీస్తారా? అనే అనుమానాలు అందరికీ వచ్చాయి.
* 'శ్రీమంతుడు' సినిమాకు అప్రెంటిస్ గా పని చేశాను. ఆ తరువాత నాని 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమాకు మొదటిసారి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశాను. ఆయనతో 'జెర్సీ' కూడా చేశాను. ఇప్పుడు 'శ్యామ్ సింగ రాయ్'. తరువాత నాని హీరోగా నటించే 'దసరా' సినిమా కూడా చేస్తున్నాను.
* రవితేజతో 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమా చేస్తున్నాను. దీని సెట్స్ వర్క్ ఆల్రెడీ మొదలయ్యాయి. నిర్మాతగా త్రిష మెయిన్ లీడ్ గా ఓ వెబ్ సిరిస్ ను సోనీ లివ్ సంస్థకు చేస్తున్నాం. 'బృందా' అనే టైటిల్ తో రాబోతోన్నాం.