Begin typing your search above and press return to search.
ఆ స్టార్ డైరెక్టర్ కి ఆ రెండు సంస్థలు 100 కోట్లు ఇచ్చాయా?
By: Tupaki Desk | 25 Jun 2023 6:00 AM GMTఅన్ని పరిశ్రమలు ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నాయి. ఛాన్స్ ఇవ్వాలే గానీ ఎగురుకుని వచ్చి సినిమాలు చేయడానికి దర్శక-నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. నేడు పాన్ ఇండియాలో..అంతర్జాతీయ మార్కెట్ లో తెలుగు సినిమా వెలిగిన వైభవంతోనే ఇది సాధ్యమైంది.
దేశమే గర్వించేలా తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు సాధించడంతో! ఇండియన్ సినిమా స్థాయి అంతకంతకు పెరుగుతుంది. దీనికి ఆధ్యుడు రాజమౌళి. ఆయనతోనే ఇదంతా సాధ్యమైంది. ఆగౌరవాన్ని అంతే పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత టాలీవుడ్ పై ఉంది.
పాన్ ఇండియా సహా ప్రపంచ మెచ్చే సినిమాలు తెలుగు భాష నుంచి మార్కెట్ లోకి వెళ్తున్నాయి. భవిష్యత్ లో హాలీవుడ్ సైతం ఒణికేలా చేయగలగాలి. అందుకు మనోళ్లు ఏమాత్రం తీసిపోరు. ప్రతిభావంతుల్ని తెలివిగా వినియోగించుకునప్పుడు ఇది సాధ్యమవుతుంది.
టాలీవుడ్ లో కొందరు అగ్ర నిర్మాతలు అలాంటి వాళ్లని ఒడిసిపట్టుకుంటున్నారు. అందుకోసం ప్రతిభావంతులకు కోట్ల రూపాయలు అడ్వాన్సులుగా చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఓ స్టార్ డైరెక్టర్ తో ఓ అగ్ర నిర్మాత ఓ భారీ బడ్జెట్ సినిమా తెలుగులో నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఇద్దరి మధ్య మంచి స్నేహాన్ని బిల్డ్ చేసింది. ఆ డైరెక్టర్ గత విజయాల గురించి చెప్పాల్సిన పనిలేదు. దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయనతోనే ఇప్పుడు ఓ అగ్ర నిర్మాత - అండ్ హిజ్ ప్రెండ్స్ భారీ చిత్రాలు నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఉప్పందింది. భవిష్యత్ ప్రణాళికలో భాగంగా రెండు అగ్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఆ డైరెక్టర్ కి 100 కోట్లు అడ్వాన్స్ రూపంలో చెల్లించినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం ఆ స్టార్ డైరెక్టర్ ఒకేసారి రెండు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. వాటి తర్వాత ఆ డైరెక్టర్ ఏ భాషలో సినిమా చేస్తారు అన్నది క్లారిటీ లేదు. కానీ మన నిర్మాతలు మాత్రం ముందుగానే అతని కోసం కర్చీప్ వేస్తున్నట్లు తెలుస్తుంది.సౌత్ లో భారీ బడ్జెట్ సినిమాలు చేసే దర్శకులు ముగ్గురు..నలుగురు మాత్రమే ఉన్నారు.వాళ్లలో కొందరు ఇప్పటికే బిజీగా ఉన్నారు.వచ్చే రెండు..మూడేళ్లు కూడా వాళ్లు బిజీగానే ఉంటారు. ఇప్పటికే వాళ్ల ప్రాజెక్ట్ లు ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాయి.
అందుకే కొంత మంది టాలీవుడ్ నిర్మాతలు ప్రత్యేకంగా ఆ డైరెక్టర్ పై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి టాలీవుడ్ హీరోలంతా ఎప్పుడు రెడీగానే ఉంటారు. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు హీరో కంటే ముందుగానే డైరెక్టర్ ని లాక్ చేయడం బెటర్ ఐడియాగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.