Begin typing your search above and press return to search.
హీరోపై నిర్మాణ సంస్థ ప్రొపగండా!
By: Tupaki Desk | 31 Dec 2019 1:15 PM GMTహీరోపైనే నిర్మాణ సంస్థ అసత్య ప్రచారమా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. పోటీ బరిలో భారీ సినిమాల మధ్య వార్ నెలకొన్న నేపథ్యంలో రిలీజ్ తేదీ విషయమై రకరకాలుగా సందిగ్ధత నెలకొందట. దానిపై టీమ్ లో భిన్నాభిప్రాయాలున్నాయి. హీరో ఒక తేదీ అనుకుంటుంటే .. నిర్మాణ సంస్థ ఇంకో తేదీని ఎంపిక చేసుకుంది. ఇప్పటికే ప్రకటించిన తేదీకే సదరు నిర్మాణ సంస్థ ఫిక్సయ్యి ఉందట. అయితే హీరోగారు మాత్రం ససేమిరా అంటూ.. రిలీజ్ తేదీని ముందుకు జరపాల్సిందేనని అంటున్నారని నిర్మాణ సంస్థనే లీకులివ్వడం చూస్తుంటే .. తేదీ విషయంలో పంతం గట్టిగానే ఉందని అర్థమవుతోంది.
బయపడి వెనక్కి తగ్గారు! అంటూ ప్రత్యర్థి ఫ్యాన్స్ పంపిణీ వర్గాల్లోనూ ప్రచారం చేయడంతో దీనిపై టీమ్ లో చర్చ సాగిందట. దాంతో మనం తగ్గేదేమిటి! అంటూ .. కాంపిటీషన్ లో ముందే రావాలన్నది హీరోగారి మాట అట. అయితే నిర్మాణ సంస్థ అందుకు ఆసక్తి చూపడం లేదు. ఇంతకీ ఈ పంతంలో ఎవరు నెగ్గుతారు? అన్నది ఇప్పటికి సస్పెన్స్. రిలీజ్ తేదీ మార్చడం ఇష్టం లేకపోతే సదరు హీరోకే చెప్పి సామరస్యంగా ఒప్పించుకోవచ్చు కదా! ఎందుకీ నెగెటివ్ ప్రచారం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకేసారి భారీ సినిమాలు రిలీజైతే.. ఇలాంటి కాంపిటీషన్ ఉంటుంది. ఎవరికి వారు బాక్సాఫీస్ వద్ద బెటర్ గా పెర్ఫామ్ చేసేందుకు ప్లాన్ చేసుకోవడం సహజమే. పోటీలో అభిప్రాయ భేధాలు తప్పనిసరి. సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి. దీంతో బెటర్ ప్లానింగ్ ముఖ్యం. అందుకే ఆ తాపత్రయం అని అనుకోవచ్చు. క్యాజువల్ మీటింగుల్లో అనుకున్న విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి మరి.