Begin typing your search above and press return to search.

ఆ కొత్త హీరోయిన్‌ పై ప్రొడ‌క్ష‌న్ టీమ్ ఫైర్‌

By:  Tupaki Desk   |   5 March 2018 12:51 PM GMT
ఆ కొత్త హీరోయిన్‌ పై ప్రొడ‌క్ష‌న్ టీమ్ ఫైర్‌
X
అస‌లే పాపం ఇండ‌స్ట్రీకి కొత్త‌. అందులోనూ షూటింగ్‌లో దెబ్బ తాకింది. అలాంటి పిల్ల‌ను ఎలా చూసుకోవాలి? అదంతా వ‌దిలేసి... ఏదో ఒక ఫోటో పోస్టు చేసింద‌ని... నేల టిక్కెట్ ప్రొడ‌క్ష‌న్ టీమ్... ఆ కొత్త హీరోయిన్‌ పై ఫైర్ అయ్యింద‌ట‌. ఆమె ఫోటో ఆమెనే పోస్టు చేసుకుంటే ప్రొడ‌క్ష‌న్ టీమ్‌ కు ఎందుకంత కోపం వ‌చ్చింది? దానికి ఒక కార‌ణం ఉంది లెండి... అదేంటంటే...

మాళ‌విక శ‌ర్మ‌... ర‌వితేజ న‌టిస్తున్న 'నేల టిక్కెట్' సినిమాతో తెరంగేట్రం చేస్తోంది. ఆ షూటింగ్ హైద‌రాబాద్‌ లో జ‌రుగుతోంది. బైక్ రైడ్ సీన్ తీస్తుండ‌గా... ఆమె కింద జారిప‌డి కాలికి దెబ్బ‌తాకింది. మొద‌ట ర‌వితేజ‌కు గాయం అయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. త‌రువాత హీరోయిన్ కాలికి దెబ్బ తాకిన‌ట్టు తెలిసింది. సినీ మీడియా ఊరుకుంటుందా ఆ విష‌యాన్ని వెబ్‌ సైట్ల‌లో రాసి ప‌డేసింది. ప్రొడ‌క్ష‌న్ టీమ్ మాత్రం... ఎవ‌రికీ ఏం కాలేద‌ని... హీరో హీరోయిన్లిద్ద‌రూ బాగానే ఉన్నార‌ని స్టేట్‌ మెంట్ ఇచ్చింది. ఈలోగా కొత్త హీరోయిన్ మాళ‌విక‌... టూ వీల‌ర్ ఛైర్‌ లో కూర్చుని... కాలికి క‌ట్టు క‌ట్టిన‌ట్టు ఉండ‌గా ఫోటో తీయించుకుంది. ఆ ఫోటోను సామాజిక మాధ్యమాల‌లో పోస్టు చేసింది. ఆ ఫోటోను చూస్తే షూటింగ్‌ లో ఆమెకు దెబ్బ తాకిన సంగ‌తి నిజ‌మేన‌ని తెలుస్తోంది. మ‌రి మీడియాతో ప్రొడ‌క్ష‌న్ టీమ్ ఎందుక‌లా అబ‌ద్ధాలో చెప్పిందో.

మాళ‌వికా ఆ ఫోటో పెట్టినందుకు ప్రొడ‌క్ష‌న్ టీమ్ ఫైర్ అయ్యి... ఆమె చేత డిలీట్ చేయించింద‌ట‌. ఎందుకంటే మీడియా వాళ్ల‌కి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు క‌దా... ఆ విష‌యం అబ‌ద్ధ‌మ‌ని మాళ‌వికా ఫోటో వ‌ల్ల తెలిసిపోతుందిగా... అందుక‌ని. అయినా షూటింగ్‌ లో కింద ప‌డ‌డం... దెబ్బ‌లు తాక‌డం... చాలాసార్లు జ‌రుగుతుంది. ఆ విష‌యంలో కూడా అబ‌ద్దాలు చెప్ప‌డం నేల టిక్కెట్ ప్రొడ‌క్ష‌న్ టీమ్‌కు ఎందుకో.