Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ - ఎవరికెంత బాసూ?

By:  Tupaki Desk   |   24 Oct 2018 12:06 PM GMT
ఆర్ ఆర్ ఆర్ - ఎవరికెంత బాసూ?
X
యంగ్ టైగర్ మెగా పవర్ స్టార్ కాంబోలో మొదటిసారి తెరకెక్కనున్న మల్టీ స్టారర్ కోసం రాజమౌళి బ్యాక్ గ్రౌండ్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఒకపక్క ఈ ఇద్దరి పాత్రలకు సంబంధించిన స్కెచ్చులు వాళ్ళ బాడీ ఫిట్నెస్ కు కావలసిన ఇన్ పుట్స్ అన్ని దగ్గరుండి మరీ హోమ్ వర్క్ చేస్తున్న రాజమౌళి వచ్చే నెల 18న షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడనే వార్తయితే వచ్చింది కాని ప్రెస్ మీట్ లాంటిది పెట్టి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇక దీనికి సంబంధించి పారితోషికాల విషయంలో ఎవరికి ఎంత దక్కుతుంది అనే ఆసక్తి కలగడం సహజం. ఇప్పటికే దీని బడ్జెట్ గురించి రకరకాల చర్చలు ఫిలిం నగర్ లో జరుగుతూనే ఉన్నాయి. 300 కోట్లు దాటేస్తుంది అన్న అంచనా అభిమానులను నిద్రపోనివ్వడం లేదు. సాధారణంగా తారక్ చరణ్ తమ మార్కెట్ ని బట్టి డిమాండ్ ని బట్టి ప్రస్తుతం 15 నుంచి 20 కోట్ల దాకా తీసుకునే రేంజ్ లో ఉన్నారు. అవి ఒక కాలపరిమితికి సంబందించిన కాల్ షీట్స్ అయితేనే. కానీ జక్కన్నతో వ్యవహారం అలా ఉండదుగా. రెండు మూడు నెలల్లో చుట్టసే బాపతు కాదు. అందుకే 200 రోజుల దాకా ఇద్దరూ కాల్ షీట్స్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది.

ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే నిర్మాత దానయ్యతో సహా ఇద్దరు హీరోలు దర్శకుడు వాటాల రూపంలో లాభాలను పంచుకోబోతున్నట్టు వినికిడి. ఎంత శాతం అనేది ఇప్పుడే తెలియదు కానీ ఒకవేళ అదే కనక నిజమైతే మూడు సినిమాల పారితోషికం దీని ఒక్కదానికే వచ్చేలా బిజినెస్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 2020లోనే విడుదల ఉంటుంది కాబట్టి ఈ ఏడాది గ్యాప్ ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న హైప్ ని రెట్టింపు చేస్తుంది. ఈ లోపు దీనికి సంబంధించిన ప్రతి కబురు టాక్ అఫ్ ది టౌన్ అయ్యేలా ఉంది