Begin typing your search above and press return to search.

'జాగ్వార్' పెళ్లి చూపుల పై క్లారిటీ!

By:  Tupaki Desk   |   3 Sep 2018 9:44 AM GMT
జాగ్వార్ పెళ్లి చూపుల పై క్లారిటీ!
X
100 రోజుల పాల‌న పూర్తిచేసుకున్న‌ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దంపతులు గ‌త శుక్ర‌వారం నాడు విజ‌య‌వాడ‌లోని కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఏపీ సీఎం చంద్ర‌బాబును కూడా కుమార స్వామి క‌లిశారు. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు విష‌యంలో వీరి భేటీ జ‌రిగింద‌ని పుకార్లు వ‌చ్చాయి. దాంతోపాటు - కుమార స్వామి కుమారుడు - క‌న్న‌డ హీరో నిఖిల్ గౌడకు.... విజయవాడకు చెందిన ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కుమార్తెకు పెళ్లిచూపులు జరిగాయ‌ని వ‌దంతులు - క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆ పుకార్ల‌పై ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత బీ శివ కోటేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. ఆ పుకార్ల‌లో వాస్త‌వం లేద‌ని చెప్పారు.

కర్ణాటక సీఎం కుమారస్వామి - ఆయ‌న స‌తీమ‌ణి...శుక్ర‌వారం నాడు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత బీ శివ కోటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఈ నేప‌థ్యంలో కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడకు - శివ కోటేశ్వరరావు కుమార్తెతో పెళ్లి చూపులు జ‌రిగాయ‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. పెళ్లి చూపుల కోసమే కుమార‌స్వామి దంప‌తులు విజ‌య‌వాడ వ‌చ్చార‌ని వార్తలు వెలువ‌డ్డాయి. ఈ నేప‌థ్యంలోనే ఆ క‌థ‌నాల‌పై శివ కోటేశ్వ‌ర రావు స్పందించారు. ఆ పెళ్లి చూపుల‌ను ఆయ‌న ఖండించారు. కుమారస్వామితో తనకు మంచి అనుబంధం ఉందని - ఆయ‌న త‌మ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారు. విజయవాడకు వచ్చిన ఆయ‌న‌ను త‌మ ఇంట్లో భోజనానికి మాత్ర‌మే ఆహ్వానించాన‌ని - త‌మ మధ్య స్నేహాన్ని కాదనలేక ఆయన వచ్చార‌ని అన్నారు. త‌మ మ‌ధ్య‌ ఎటువంటి పెళ్లి ప్రస్తావనా రాలేదని క్లారిటీ ఇచ్చారు.