Begin typing your search above and press return to search.
ఫ్లాప్ హీరో మూవీ 3 వారాల ముందే బిజినెస్ క్లోజ్
By: Tupaki Desk | 18 March 2019 10:49 AM GMTమెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఆరంభంలో కాస్త సందడి చేసినా గత రెండు సంవత్సరాలుగా దాదాపు అరడజను ఫ్లాప్స్ తో తెగ ఇబ్బంది పడుతున్నాడు. వరుసగా ఫ్లాప్ లు వచ్చినా కూడా తేజూ అదృష్టం బాగుండటంతో ఆయనతో వర్క్ చేసేందుకు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా యూత్ ఆడియన్స్ పల్స్ బాగా తెల్సిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈ మెగా హీరోతో చిత్రలహరి ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది.
టీజర్ విడుదలకు ముందు ఈ చిత్రం గురించి పెద్దగా చర్చ లేదు. కాని ఎప్పుడైతే టీజర్ విడుదలైందో అప్పుడే సినిమా ఫలితంపై నమ్మకం ఏర్పడింది. ఇది తప్పకుండా కిషోర్ తిరుమల మార్క్ ఎంటర్ టైనర్ గా ఉంటుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అయ్యింది. ఏప్రిల్ 12వ తారీకున ఈ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. విడుదలకు ఇంకా మూడు వారాలు ఉంది. అయినా అప్పుడే అన్ని ఏరియాల్లో మరియు ఇతర బిజినెస్ లు పూర్తి చేసుకుంది.
ఒక ఫ్లాప్ హీరో మూవీ మూడు వారాల ముందు బిజినెస్ క్లోజ్ చేసుకోవడం అంటే చాలా అరుదైన విషయం. అది కూడా మంచి రేట్లకు, నిర్మాతలకు టేబుల్ ఫ్రాఫిట్స్ వచ్చేలా తేజూ మూవీ బిజినెస్ చేయడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ నీయాంశం అవుతోంది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ప్రైమ్ వీడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇలా అన్ని రైట్స్ కలిపి దాదాపుగా 25 కోట్ల వరకు బిజినెస్ చేసిందని తెలుస్తోంది. పెట్టిన పెట్టుబడికి ఇది ఎక్కువే అంటూ సమాచారం అందుతోంది. సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే నిర్మాతల లాభాలు మరింతగా పెరగడం ఖాయం.