Begin typing your search above and press return to search.

ప్రాజెక్ట్ K.. ఫస్ట్ డీల్ 70 కోట్లు!

By:  Tupaki Desk   |   2 Jan 2023 2:48 PM GMT
ప్రాజెక్ట్ K.. ఫస్ట్ డీల్ 70 కోట్లు!
X
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ లేనప్పుడు అందరి ఫోకస్ ఎక్కువగా ప్రాజెక్ట్ K సినిమా పైనే ఉంది. వరుసగా ఆదిపురుష్, సలార్ సినిమాల తరువాత రాబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సరి కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.

ఎందుకంటే దర్శకుడు నాగ్ అశ్విన్ తప్పకుండా ఈ సినిమాతో మ్యాజిక్ క్రియేట్ చేయగలడు అని అనుకుంటున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ తోనే చిత్ర యూనిట్ సభ్యులు ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ K సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను కూడా అప్పుడే మొదలైనట్లుగా తెలుస్తోంది. ఒకవైపు షూటింగ్ కొనసాగుతూ ఉంటే మరోవైపు నిర్మాత అశ్విని దత్ సినిమా వ్యాపారాన్ని మార్కెట్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నాడు.

అయితే ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ పెద్దగా రాకముందే కొన్ని ఏరియాల నుంచి భారీ స్థాయిలో ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నైజాంకు చెందిన బడా సిండికేట్ గ్రూప్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులను దాదాపు 70 కోట్లు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఏషియన్ సునీల్ అలాగే నిర్మాత సురేష్ బాబు కూడా చాలా కాలంగా డిస్ట్రిబ్యూషన్ సిండికేట్ ను కొనసాగిస్తున్నారు.

గతంలో వీరి కలయికలో సీతారామం, కార్తికేయ 2 విడుదలయ్యాయి. అలాగే ఇటీవల ధమాకా సినిమాలను కూడా గ్రాండ్ గా విడుదల చేయడం జరిగింది. ఇక ఆ సినిమాలపై అయితే వీరికి భారీ స్థాయిలో పెట్టుబడి వచ్చింది. ఇక ఇప్పుడు వైజయంతి మూవీస్ లో అశ్విని దత్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ K నైజం హక్కులను కూడా భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సెట్ అయిన మొదటి డీల్ ఇదే అని తెలుస్తోంది. నైజాం డీల్ ఈ తరహాలో ఉంటే మిగతా ఏరియాలలో కూడా అద్భుతమైన డీల్స్ సెట్ అవుతాయి అని చెప్పవచ్చు. నిర్మాత అశ్విని దత్ ప్రాజెక్ట్ K సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎంతవరకు ప్రాఫిట్స్ అందుకుంటాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.