Begin typing your search above and press return to search.
Project K రిలీజ్ వాయిదా పడనుందా?
By: Tupaki Desk | 12 July 2023 1:00 PM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ Project K. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక బడ్జెట్ తో ఇప్పటి వరకు రానటువంటి కథాంశం తో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ ఈ చిత్రం లో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. అమితాబచ్చన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.
దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా ఈ సినిమా లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ని పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇండియన్ ఫస్ట్ హాలీవుడ్ మూవీ అనే బ్రాండ్ ని ఈ చిత్రం సొంతం చేసుకోనుంది. ఈ సినిమా ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇండియన్ మైథాలజీని ఫ్యూచర్ కి లింక్ చేసి Project K ని ఆవిష్కరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ Project K మూవీ మెయిన్ టైటిల్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. దీనిని ఈ నెల 20న రివీల్ చేయనున్నారు. అయితే అమెరికా లోని శాన్ డియాగో కామిక్-కాన్ లో మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా లాంచ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ లో హాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారని తెలుస్తోంది. దీంతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పార్టిసిపేట్ చేయనున్నారు.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. దానికి సంబందించిన అఫీషియల్ డేట్ కూడా ఎనౌన్స్ చేసేశారు. ప్రస్తుతం పరిణామాలు చూస్తూ ఉంటే మూవీ వాయిదా పడే అవకాశం ఉందని టాక్. టైటిల్ ని ఎనౌన్స్ చేసిన రోజునే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందంట.
వేసవిలో మూవీ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల లో వినిపిస్తోన్న మాట. మూవీ షూటింగ్ చివరి దశలో ప్రస్తుతం ఉందంట. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్ కూడా జరుగుతుంది ఇక శాన్ డియాగో కామిక్-కాన్ లో జరగబోయే ఫస్ట్ లుక్ లాంచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.