Begin typing your search above and press return to search.
'ప్రాజెక్ట్-K' అప్డేట్: సూపర్ హీరోగా ప్రభాస్..!
By: Tupaki Desk | 23 Oct 2021 5:31 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ''ప్రాజెక్ట్ K'' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళింది. ఇందులో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తుండగా.. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
''సినిమాకి కొత్త సహస్రాబ్దిని తీర్చిదిద్దిన సూపర్ హీరోకి.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. #ProjectK సెట్స్ కి మిమ్మల్ని స్వాగతిస్తున్నందుకు మేము సూపర్ ఎగ్జైటింగ్ గా ఉన్నాం. దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము'' అని చిత్ర బృందం పేర్కొంది. ఇందులో 'సూపర్ హీరో' అనే పేరు ఉపయోగించడంతో.. ఇది సూపర్ హీరో ఫిల్మ్ అని.. ప్రభాస్ సూపర్ హీరోగా కనిపిస్తారని హింట్ ఇస్తున్నట్లు అందరూ భావిస్తున్నారు. 'ప్రాజెక్ట్ K' సినిమా సైన్స్ ఫిక్షన్ & సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, 'ప్రాజెక్ట్-K' చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో భారతీయ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో కూడా రూపొందించనున్నారు. స్టార్ కాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ ఇందులో భాగం కానున్నారు. లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ ఈ చిత్రానికి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తుండగా.. డానీ శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ తో పది రోజుల షెడ్యూల్ షూటింగ్ జరిపారు.
నవంబర్ నుంచి 'ప్రాజెక్ట్ K' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నాన్ స్టాప్ గా 12 నుంచి 13 నెలల పాటు నిర్విరామంగా చిత్రీకరణకు ప్లాన్ చేశామని.. ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశామని నిర్మాత ఇటీవలే వెల్లడించారు. నవంబర్ లో మొదలయ్యే షెడ్యూల్ లో ప్రభాస్ - అమితాబ్ తో పాటుగా మిగతా ప్రధాన తారాగణమంతా పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ భారతీయ సిల్వర్ స్క్రీన్ మీదనే అత్యధిక బడ్జెట్ తో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో విజువల్ వండర్ గా రూపొందనుంది. దీని కోసం ప్రభాస్ 200 రోజుల కాల్షీట్స్ కేటాయించారని టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడికానున్నాయి.