Begin typing your search above and press return to search.
హిందీ తారలు డ్రగ్స్ తీసుకుంటారని రామ్ దేవ్ కామెంట్
By: Tupaki Desk | 16 Oct 2022 12:30 PM GMTబాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా గురించి క్వీన్ కంగన రనౌత్ సంచలన ఆరోపణలు చేస్తూనే ఉంది. రాజకీయ నాయకులతో లింకప్ అయ్యి బాలీవుడ్ స్టార్లు ఈ దందాలో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. కేవలం కంగన మాత్రమే కాదు చాలా మంది డ్రగ్స్ యథేచ్ఛగా వినియోగిస్తారని పార్టీలు పబ్బుల్లో ఇది చాలా కామన్ అని అంగీకరిస్తారు. ఇంతకుముందు ప్రముఖ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనక డ్రగ్స్ దందాలు.. మాఫియా ఉన్నాయన్న సత్యంపైనా ఎన్.సి.బి ఆరాలు తీసింది. ఇలా చూస్తే బాలీవుడ్ సహా సినీపరిశ్రమల చుట్టూ డ్రగ్స్ ఉచ్చు ఉండనే ఉందని అర్థమవుతోంది.
ఇప్పుడు ప్రముఖ యోగా గురూ దీనిపై ఆరోపించడం సంచలనమైంది. బాలీవుడ్ స్టార్లు డ్రగ్స్ తీసుకుంటారని రామ్‌దేవ్ బాబా ఆరోపించారు. తారలు డ్రగ్స్ సేవిస్తున్నారని యోగా గురు బాబా రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొరాదాబాద్ లో శనివారం జరిగిన ఆర్యవీర్,.. వీరాంగన సదస్సులో బాబా రామ్ దేవ్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని వ్యాఖ్యానించారు. అమీర్ ఖాన్ గురించి నాకు తెలియదు.. షారుక్ ఖాన్ బిడ్డ డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుబడి జైలులో ఉన్నాడు. నటీమణులు ఆందోళన చెందుతున్నారు.. వారి గురించి దేవునికి మాత్రమే తెలుసు.. అంటూ రామ్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
సినీ పరిశ్రమ చుట్టూ డ్రగ్స్ ఉన్నాయి. రాజకీయాల్లో కూడా డ్రగ్స్ ఉన్నాయి.. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ చేస్తారు.. ప్రతి డ్రగ్ అడిక్షన్ నుంచి భారతదేశం విముక్తి పొందాలని తీర్మానం చేయాలి.. ఇందుకోసం ఉద్యమం చేపడతామని రామ్ దేవ్ అన్నారు. బాబాజీ వ్యాఖ్యలకు ఖాన్ ల త్రయం ఏమని కౌంటర్లు వేస్తారో చూడాలి. సోషల్ మీడియాల్లో సామాన్య ప్రజల్లో ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.