Begin typing your search above and press return to search.

మహాసముద్రంను మల్టీస్టారర్ గా ప్రమోట్‌!

By:  Tupaki Desk   |   9 Oct 2021 3:33 PM GMT
మహాసముద్రంను మల్టీస్టారర్ గా ప్రమోట్‌!
X
టాలీవుడ్‌ తో పాటు ఏ వుడ్‌ అయినా మల్టీ స్టారర్ సినిమాలు అంటే మహా మోజు ఉంటుంది. అందుకే చిన్న మల్టీ స్టారర్ అయినా.. పెద్ద మల్టీ స్టారర్ అయినా కూడా జనాలు ఎగబడి చూస్తూనే ఉంటారు. కంటెంట్‌ కాస్త బాగుండి.. పర్వాలేదు అనిపించుకుంటే ఒకే టికెట్టు పై రెండు సినిమాలు అన్నట్లుగా ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరడం చాలా కామన్‌ గా జరుగుతోంది. అందుకే మహాసముద్రం సినిమాను మల్టీ స్టారర్ గా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదటగా శర్వానంద్‌ హీరోగా సిద్దార్థ్‌ కీలక పాత్రలో సినిమా అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా మల్టీ స్టారర్ అంటూ ప్రచారం చేస్తూ బజ్ క్రియేట్‌ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయిన మహాసముద్రంలో శర్వానంద్ మరియు సిద్దార్థల పాత్రలు చాలా సీరియస్ గా ట్రైలర్‌ లో కనిపిస్తున్నాయి. ఇద్దరికి జోడీగా హీరోయిన్స్ ఉండటంతో పాటు ట్రైలర్‌ లో ఇద్దరి పాత్రలకు సమాన ప్రాముఖ్యత ఉంటుందని తెలియజేసేలా ప్లాన్‌ చేశారు. టాలీవుడ్ లో సిద్దార్థ్‌ హీరోగా నటించి చాలా ఏళ్లు అవుతుంది. అయితే ఆయన డబ్బింగ్ సినిమాలు రెగ్యులర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. అంతే కాకుండా సిద్దు నటించిన గత సినిమాలు ఇప్పటికి బుల్లి తెరపై వస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. కనుక ఖచ్చితంగా మహాసముద్రంలో సిద్దార్థ్ ఉండటంను చాలా పాజిటివ్‌ గా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అనే టాక్‌ వినిపిస్తుంది.

మహసముద్రం సినిమాను అక్టోబర్‌ 14న దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. ఆర్‌ ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి ఈ సినిమాను గత మూడు నాలుగు సంవత్సరాలుగా అనుకుంటూ వస్తున్నాడు. ఇద్దరు హీరోలు సెట్ అవ్వక పోవడం వల్ల చాలా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు శర్వానంద్ మరియు సిద్దార్థ్ లు సినిమాలో నటించడంతో మహాసముద్రం కాస్త ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ సినిమాలో కీలక పాత్రల్లోల జగపతిబాబు మరియు రావు రమేష్‌ లు నటించారు. ఇక హీరోయిన్స్ గా ఈ సినిమాలో అను ఎమాన్యూల్‌ మరియు అదితి రావు హైదరిలు హీరోయిన్స్ గా నటించారు. రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా శర్వా మరియు సిద్దార్థ్‌ కెరీర్ లో అత్యంత కీలకంగా మారింది.