Begin typing your search above and press return to search.
వీడియో: వెంకీ మామకు వెంకీ తాతగా ప్రమోషన్!
By: Tupaki Desk | 7 Sep 2021 5:11 AM GMTవిక్టరీ వెంకటేష్ ని మేనల్లుడు అక్కినేని నాగచైతన్య మాత్రమే కాదు.. ఇంకా ఆయన స్నేహితులు సన్నిహితులు కూడా `వెంకీ మామా` అంటూ ఆప్యాయంగా సరదాగా పిలుచుకుంటారు. బాబి దర్శకత్వంలో వెంకీ-చై కాంబోలో `వెంకీ మామ` టైటిల్ తో సినిమానే తీయగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా వెంకీ మామను వెంకీ తాతా అని పిలిచేవాళ్లు ఉన్నారని ఎవరికైనా తెలుసా?
వెంకీ మామను తాతా అని పిలిచేసే ఒక క్యూట్ చిన్నారిని వెంకటేష్ కుమార్తె ఆశ్రిత స్వయంగా పరిచయం చేశారు. తాను నిర్వహిస్తున్న ఇన్ఫినిటీ ప్లాటర్ వంట ఆధారిత యూట్యూబ్ ఛానెల్ లో ఈ చిన్నారి ప్రత్యక్షమై బోలెడంత సందడి చేసింది. బేకింగ్ ఫుడ్ వంటల కార్యక్రమం తాజా ఎపిసోడ్ లో తన మేనకోడలు ఐరాను ప్రత్యేక అతిథిగా తీసుకువచ్చారు ఆశ్రిత. ఐరాకి ఇష్టమైన వంటకం వైట్ చాక్లెట్ యునికార్న్ ఫడ్జ్ ని ఆశ్రిత తయారు చేసారు. తనతో పాటే ఉండి బేబి ఐరా ఆ ప్రాసెస్ ని ఆస్వాధించింది.
ఇంతకీ బేబి ఐరా ఎవరు? అంటే.. రానా సోదరి మాళవిక దగ్గుబాటి కుమార్తె అని తెలిసింది. ఆసక్తికరంగా ఐరా-ఆశ్రిత జోడీ తయారు చేసిన వంటకం రుచి చూసేందుకు ఎవరొచ్చారో తెలుసా? ఇంకెవరు వెంకీ మామ అలియాస్ వెంకీ తాత దిగిపోయారు. ఆ చిన్నారి వెంకటేష్ ని వెంకీ తాతా అని పిలిచేస్తుంటే ఎంతో ముచ్చటగా మురిపెంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఏజ్ 60కి చేరువైనా వెంకీ ఇంకా మామలానే ఉన్నారు కానీ తాతలా కనిపించడం లేదంటూ అభిమానులు కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. తనని తాతా అంటూ పిలొద్దు ఐరా! అంటూ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఇటీవల నారప్ప చిత్రంలో వెంకీ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. ఇందులో యువకుడిగా అలాగే తాత అయ్యాక కూడా అద్భుత నటనతో కట్టి పడేసారు. నారప్ప తాతలో వీరత్వం స్టన్నయిపోయేలా చేస్తుంది క్లైమాక్స్ ముందు. మొత్తానికి వెంకీ మామకు వెంకీ తాతగా ప్రమోషన్ ఇచ్చినది మాత్రం బేబి ఐరా!
వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. వరుణ్ తేజ్- తమన్నా - మెహ్రీన్ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎఫ్ 2 ని మించి ఫన్ ఎమోషన్ ఉంటాయని రావిపూడి చెబుతున్నారు.

Venky thatha