Begin typing your search above and press return to search.
విడుదల ఎప్పుడో క్లారిటీ లేకున్నా ప్రమోషన్స్ షురూ
By: Tupaki Desk | 9 May 2020 4:50 AM GMTకరోనా కారణంగా టాలీవుడ్ స్థంభించి పోయింది. గత రెండు నెలలుగా సినిమా షూటింగ్స్ లేవు. థియేటర్లలో బొమ్మ పడినది లేదు. ఈ సమ్మర్‌లో పదుల సంఖ్యలో సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చేవి. కొన్ని వందల కోట్ల బిజినెస్ జరిగేది. కాని కరోనా లాక్‌డౌన్ కారణంగా వందల కోట్ల లాభాలు ఏమో కాని భారీ నష్టాలను నిర్మాతలు మూట కట్టుకున్నారు. సినిమా ఇండస్ట్రీ పూర్తిగా స్థబ్దతతో ఉంది. ఇలాంటి సమయంలో రామ్ నటించిన ‘రెడ్’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నేడు ‘రెడ్’ చిత్రంలోని ఒక పాట మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నారు. ఎలాంటి స్పెషల్ డే లేకున్నా కూడా ఈ వీడియోను విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల ముందు ఇలాంటి హడావుడి కనిపిస్తుంది. కాని ఈ లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు.. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. అయినా కూడా రెడ్ చిత్రం విడుదల కోసం చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటి నుండే ప్రమోషన్స్ చేయడం ప్రారంభించారు.
మూడు నెల్లో సినిమాల విడుదల ప్రారంభం అయ్యే అవకాశం ఉందని.. ఎప్పుడైతే పరిస్థితులు కొలిక్కి వచ్చి థియేటర్లు తెరుచుకుంటాయో అప్పుడు వెంటనే సినిమాను విడుదల చేయాలని ‘రెడ్’ మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ఇప్పటి నుండే సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రతి వారం ఏదో ఒక వీడియో లేదా పోస్టర్ ను విడుదల చేస్తూ ఉండాలని నిర్ణయించారు.
సుదీర్ఘ కాలపు ప్రమోషన్ తో సినిమాపై అంచనాలు పెరుగుతాయనే ఉద్దేశ్యంలో యూనిట్ సభ్యులు ఉన్నారట. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. విడుదల సిద్దం అయిన ఈ సినిమా రామ్ కెరీర్ లో మరో విజయాన్ని చేర్చుతుందనే నమ్మకంతో ఉన్నారు. రామ్ కు జోడీగా ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ ఇంకా అమృతా అయ్యర్.. మాళవిక శర్మలు నటించారు.