Begin typing your search above and press return to search.
మతితప్పి భాగమతి మీద పడ్డారు
By: Tupaki Desk | 31 Jan 2018 4:42 AM GMTఏదో ఒక వివాదం చేసి పబ్బం గడుపుకోవాలనే ఆత్రం ఈ మధ్య కొన్ని వర్గాల్లో బాగా వ్యక్తమవుతోంది. పద్మావత్ సినిమా విషయంలో రాజ్ పుత్ వర్గీయులు - కర్ణి సేన సభ్యులు ఎందుకు ఇంత మితిమీరిన నిరసన చేపట్టారో సినిమా చూసిన వాళ్ళకు ఇంచు కూడా అర్థం కావడం లేదు. ఇంకా దేశ వ్యాప్తంగా అక్కడక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సినిమా విడుదలకు ముందు వరకు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అన్న వాళ్ళు వచ్చాక మాత్రం ఏ సన్నివేశాల వల్ల - ఏ పాత్రల వల్ల తమ మనసులు గాయపడ్డాయో మాత్రం చెప్పడం లేదు. కాని తమిళనాడులోని ఈరోడ్ లో పద్మావత్ సినిమాను వ్యతిరేకిస్తున్న కొందరు పద్మావతి సినిమా అనుకోని మన అనుష్క నటించిన భాగమతి సినిమా ప్రదర్శనను అడ్డుకునే ప్రయత్నం చేయటం సోషల్ మీడియాలో వైరల్ జోక్ గా మారింది.
రెండు పేర్లలో చివరిలో మతి అనే సౌండింగ్ కామన్ గా ఉండటంతో ముందు వెనుక చూసుకోకుండా భాగమతి ప్రదర్శిస్తున్న థియేటర్ బయట దీపికా పదుకునే బ్యానర్ పట్టుకుని నిరసన చేయటం మొదలు పెట్టారు. పోనీ రెండు ఒకే చోట ఆడుతూ ఉంటే పొరపాటు అనుకోవచ్చు. పద్మావత్ అక్కడికి దూరంగా ఉన్న వేరొక థియేటర్లో ఆడుతోంది. నిరసన మొదలు పెట్టిన కాసేపటికి అనుమానం వచ్చిన యాజమాన్యం బయటికి వచ్చి చూస్తే దీపికా పడుకునే బ్యానర్లు - తనకు వ్యతిరేకంగా అరుపులు వినిపించాయి. మనసులోనే పగలబడి నవ్వుకున్న సదరు థియేటర్ వర్గాలు బాబు ఇది పద్మావతి కాదు భాగమతి కావాలంటే లోపలికి వెళ్లి చూసుకోండి - ఇదేమైనా పశువుల దొడ్డా అని బిగ్గరగా భయపెట్టే అనుష్క కనిపిస్తుందని సెలవిచ్చారు.
దీంతో నాలిక కరుచుకున్న నిరసనకారులు అప్పటి దాకా కాల్చేసిన బ్యానర్లు - దిష్టి బొమ్మలు పట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీసారు. ఇది మొత్తం వీడియో లో రికార్డు అయిపోయింది. కొసమెరుపు ఏంటంటే ఇక్కడ పొరపాటు తెలుసుకుని అసలు థియేటర్ లు వెళ్ళే లోపే మ్యాట్నీ షో పూర్తయ్యి జనం కూడా బయటికి వచ్చేసారు. ఏదో సామెత చెప్పినట్టు అయ్యింది వ్యవహారం. భాగ - పద్మా లను వదిలేసి చివర్లో మతిని మాత్రమే చదువుకుంటే తెలివి ఇలాగే తెల్లారుతుందని సోషల్ మీడియాలో జోకులు బాగా పేలుతున్నాయి.