Begin typing your search above and press return to search.
తెలుగు వారు గర్వించేలా చేసిన రానా
By: Tupaki Desk | 30 Nov 2018 5:02 PM GMTటాలీవుడ్ లో రానా స్టార్ గా, సూపర్ స్టార్ గా ఎదగలేక పోయినా మంచి నటుడిగా మాత్రం పేరు తెచ్చుకున్నాడు. అయితే టాలీవుడ్ ఖ్యాతిని బాలీవుడ్ తో పాటు, అంతర్జాతీయ వేదికలపై ఎప్పటికప్పుడు ఇనుమడింప చేస్తున్నాడు. ప్రస్తుతం రానా జపాన్ లో ఉన్నాడు. కామిక్ కాన్ ఓపెనింగ్ కార్యక్రమం కోసం రానా ప్రత్యేక ఆహ్వానంపై అక్కడకు వెళ్లాడు. ఆ సందర్బంగా రానా తెలుగు కాయిన్ ను షేర్ చేశాడు.
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అంటూ రాసిన మేడిన్ జపాన్ కాయిన్ ను షేర్ చేసిన రానా జపాన్ లో తెలుగు వారి సత్తా చాటాడు. ఒక ప్రాంతీయ భాషకు జపాన్ లో ఇంతటి గౌరవం దక్కడం చాలా గొప్ప విషయం. ఇక ‘బాహుబలి’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్న రానాకు జపాన్ ఆడియన్స్ నుండి మంచి స్పందన దక్కింది. జపాన్ లో తనకు దక్కిన అభిమానంను రానా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అదే సమయంలో రానా అవెంజర్స్ లోని కీలక పాత్ర అయిన థనస్ ను రూపొందించిన స్టాన్ లీ కి ఘనంగా శ్రద్దాంజలి ఘటించాడు.
ఎన్నో అద్బుతమైన పాత్రలను క్రియేట్ చేసిన స్టాన్ లీ కొన్ని వారాల క్రితం మృతి చెందిన విషయం తెల్సిందే. జపాన్ లో స్టాన్ లీకి రానా నివాళ్లు అర్పించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అవెంజర్స్ లోని థనస్ పాత్రకు రానా తెలుగులో డబ్బింగ్ చెప్పిన విషయం తెల్సిందే. జపాన్ లో రానా తెలుగు వారు గర్వించేలా చేశాడు.