Begin typing your search above and press return to search.

అమ్మానాన్నల పుణ్యమే.. నాకు వరం

By:  Tupaki Desk   |   27 Jan 2017 7:43 AM GMT
అమ్మానాన్నల పుణ్యమే.. నాకు వరం
X
టాలీవుడ్ జనాలు జేసుదాసుగా పిలుచుకునే జె ఏసుదాసుకు.. కేంద్రం తాజాగా పద్మ విభూషణ్ అవార్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశం గర్వించదగ్గ గాయకునిగా గుర్తింపు పొందిన ఈయన.. మరిచిపోలేని ఎన్నో పాటలతో శ్రోతలను అలరించారు.

'నా మొదటి గురు నా తండ్రి అగస్టీన్ జోసెఫ్. అక్కడి నుంచి ఎంతో మంది గురువులు నన్ను నడిపించారు. వారు సాధించినదాని కంటే ఇదేమీ ఎక్కువ కాదు. బాలమురళీ కృష్ణగారికి నేను ఏకలవ్య శిష్యుడిని. అలాగే ఇంత సాధిండానికి కారణం మా అమ్మానాన్న చేసిన తపస్సు.. వారు చేసిన పుణ్యం.. నాకు వరం అయ్యాయంతే. చిన్నప్పటి నుంచి సంస్కృత పదాలు పలకడంలో నాన్న చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఏ ఒక్క పదం అయినా.. సరిగా ఉచ్ఛరించే వరకూ వదిలేవారు కాదు. అదే నాకు తర్వాత కాలంలో చాలా హెల్ప్ అయింది' అని చెప్పారు ఏసుదాస్.

పేరులోనే ఆయన మతం తెలుస్తున్నా.. అన్ని మతాలకు సంబంధించిన భక్తి పాటలు పాడారాయన. ' పాటకు కులం మతం లాంటివేమీ ఉండవు. భగవద్గీత.. ఖురాన్.. బైబిల్.. ఇలా ఏ గ్రంథం చదివినా.. దేవుడొక్కడే అని చెబుతాయి. మనం నియమాలు పెట్టుకుని.. నీ దేవుడు నా దేవుడు అని విభజించుకున్నాం. ఈ విభజన చేసుకుని మనశ్శాంతిగా ఉంటున్నామా?' అంటూ ప్రశ్నించారాయన.

భక్తిపాటలతో పాటు రొమాంటిక్ సాంగ్స్ కూడా మెప్పించారు ఏసుదాస్. 'భక్తి.. ప్రేమ.. దుఃఖం.. ఇవన్నీ పాటల్లో రసాలు మాత్రమే. పాటకు ఊపిరి పోయడం నా బాధ్యత అంతే. అలాగే భాష కంటే అక్షరాలనే ఎక్కువగా నమ్ముతాను. కృష్ణుడులోనూ ముందు క్రి ఉంటుంది.. క్రీస్తులోనూ క్రి ఉంటుంది. పదాలతో భాష తెలుస్తుంది కానీ.. అక్షరాలతో తెలియదు కదా.. అందుకే నేను భాష విషయంలో అక్షరాలకే ఇంపార్టెన్స్ ఇస్తాను' అన్న పద్మ విభూషణ్ జె ఏసుదాస్.. ఈ ప్రపంచంలో దేనికైనా అంతం ఉంటుందేమో కానీ.. నేర్చుకోవడం మాత్రం ఎప్పటికీ అనంతమే అని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/