Begin typing your search above and press return to search.
నిన్ను చూస్తే గర్వంగా ఉంది నాన్న : నాగబాబు
By: Tupaki Desk | 13 Dec 2020 8:30 AM GMTనిహారిక.. చైతన్యల వివాహం వైభవంగా ఉదయ్ పూర్ లో జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వేడుకలకు సంబంధించిన సోషల్ మీడియా ఫొటోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెల్సిందే. ఆ ఫొటోలు చూస్తే పెళ్లి ఎంత వైభవంగా జరిగిందో అర్థం అవుతుంది. అద్బుతమైన పెళ్లి వేడుకతో పాటు పెళ్లికి హాజరు అయిన ప్రతి ఒక్కరు కూడా అబ్బుర పడే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తం పెళ్లి ఏర్పాట్ల బాధ్యతను వరుణ్ తేజ్ చూసుకున్నాడు అంటూ స్వయంగా నాగబాబు పేర్కొన్నాడు. తన కొడుకు ఇంత పెద్ద వాడు అయ్యాడు అంటే ఆశ్చర్యంగా ఉందన్నాడు.
నిహారిక పెళ్లి బాధ్యతలు అన్ని తాను చూసుకుంటూ నాకు చాలా బాధ్యత తగ్గించాడు. నా చేతుల్లోనుండి బయటకు వచ్చిన వాడు అందరిని కమాండ్ చేస్తు పెళ్లి పనులు చేస్తున్న సమయంలో నాకే ఆశ్చర్యం వేసింది. నేను ఆశించిన దాని కంటే ఎక్కువగా ఇచ్చావు. నేను ఊహించిన దాని కంటే ఎక్కువగా పెళ్లి వైభవంగా నిర్వహించావు. ప్రతి ఒక్కరు పెళ్లి గురించి మాట్లాడుకునేలా చేసినందుకు గాను వరుణ్ ను చూసి గర్విస్తున్నాను అంటూ నాగబాబు అన్నారు. నా బాధ్యతలను పంచుకోవడంతో పాటు అనుకున్న దానికంటే ఎక్కువగా కష్టపడ్డావు..నిన్ను చూస్తే గర్వంగా ఉంది నాన్న అంటూ నాగబాబు ఎమోషన్ అయ్యారు.