Begin typing your search above and press return to search.
30 ఇయర్స్ పృథ్వి సేఫ్ గేమ్
By: Tupaki Desk | 25 Jun 2019 7:44 AM GMTఆ మధ్య ఓ సినిమాలో బాలయ్యను విపరీతంగా స్పూఫ్స్ రూపంలో ఇమిటేట్ చేసిన 30 ఇయర్స్ పృథ్వి దానికి వచ్చిన ఆ హీరో అభిమానుల స్పందన చూసి తర్వాత సైలెంట్ అయ్యాడు. అలాంటివి చేయడం దాదాపు తగ్గించేశాడు. స్వయంగా బాలకృష్ణే ఈ విషయంగా హెచ్చరించినట్టు గాసిప్ వచ్చింది కానీ దాని గురించి ఎక్కువ రాద్ధాంతం కాలేదు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం నిన్న విడుదలైన బుర్రకథ ట్రైలర్.
అందులో పృథ్వి సాహోలోని డై హార్డ్ ఫ్యాన్స్ డైలాగ్ తో పాటు అరవింద సమేత వీర రాఘవలో ఎన్టీఆర్ ప్యాంటుకు కత్తి తుడుచుకునే స్టైల్ ని ఇమిటేట్ చేశాడు. దీని గురించి నిన్నే చాలా కామెంట్స్ వచ్చాయి. ఇంకా సాహూ విడుదల కాకుండానే ఈ వాడకం ఏంటని కొందరు అడిగితే చేస్తే చేసావ్ కానీ బాగుంది అంటూ ఇంకొందరు మొత్తానికి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఎందుకన్నా మంచిదని పృథ్వి ముందస్తు క్లారిటీ ఇచ్చేస్తున్నాడు
ఇందులో తన పాత్ర వేరని కేవలం ఆ సన్నివేశాలను బట్టి ఎలాంటి అవగాహనకు రావొద్దని చెప్పేస్తున్నాడు. కథలో చాలా కీలకమైన పాత్రను డైమండ్ రత్నబాబు ఇచ్చారని సినిమా చూసాక అర్థమవుతుందని అంతే తప్ప ప్రభాస్ తారక్ లను అనుకరించడం గురించి ఎక్కువ ఫోకస్ పెట్టకండని కోరాడు. అనవసరమైన ట్రాలింగ్ కి అవకాశం ఇవ్వకుండా పృథ్వి ముందుజాగ్రత్త పడుతున్నాడన్న మాట. బుర్రకథ ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఆది సాయికుమార్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలు పోషించిన ఈ మూవీలో మిస్త్రి చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడీ పృథ్వి చెప్పిన వెర్షన్ ప్రకారం కథలో అంత స్పెషల్ రోల్ ఏముందో ఇంకో మూడు రోజుల్లో తేలిపోతుంది