Begin typing your search above and press return to search.
రేపట్నుంచి సంగతి తేల్చేస్తా!- పృథ్వీరాజ్
By: Tupaki Desk | 12 Jan 2020 4:53 PM GMT30 ఇయర్స్ పృథ్వీ ఫోన్ కాల్ టేపులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. రకరకాల ఎమోషన్స్ నడుమ ఎస్వీబీసీ చానెల్ ఛైర్మన్ పదవికి అతడు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు మీడియా ముందుకు వచ్చిన పృథ్వీ ప్రత్యర్థుల కుట్రపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై ముసుగు దాడులకు పాల్పడిన ఘటనను తలుచుకుని ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తనకు పదవి వచ్చినప్పటి నుంచి కొందరు పదే పదే వెంటాడారని .. అలాగే పరిశ్రమ సన్నిహితుడు అన్నగారైన పోసానికి తనకు మధ్య చిచ్చు పెట్టారని ఇదంతా చేస్తోంది ఎవరో తనకు తెలుసునని ఆయన మీడియా ముఖంగా అన్నారు.
ఎస్.వీ.బీ.సీ చానెల్ బాధ్యతలు చేపట్టక ముందు నుంచి తాను స్వచ్ఛంగా ఉన్నానని అయితే తాను పద్మావతి గెస్ట్ హౌస్ లో మందు తాగానని పుకార్లు పుట్టించారని.. 9నెలలుగా తాను మందు (ఆల్కహాల్) అన్నదే ముట్టలేదని అన్నారు. కావాలంటే దర్యాప్తులో నిగ్గు తేల్చమని తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా కమిటీకి వెళ్లడించానని తెలిపారు. ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే తనని ఆ శ్రీవెంకటేశ్వరుడే శిక్షిస్తారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్నాళ్లు ఓపిగ్గా భరించాను. కానీ నాపై ఆరోపణలు చేస్తూ డబ్బింగ్ వాయిస్ తో నా పరువు తీశారని దానివల్ల తీవ్రంగా కలత చెందానని రెండ్రోజులుగా నిద్ర పోలేదని పృథ్వీ అన్నారు. తప్పు చేస్తే రివ్యూ కమిటీ ఆ తప్పును నిగ్గు తేలుస్తుందని అన్నారు. ఇన్నాళ్లు ఆగినా.. రేపటినుంచి సంగతి చూస్తాను! అంటూ పృథ్వీ మీడియా ముందే సీరియస్ అయ్యారు. తాను ఎస్వీబీసీ చానల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆ ధైర్యాన్ని నిజాయితీని మెచ్చుకుంటూ వైకాపా కార్యకర్తలు అభినందించారని వెల్లడించారు. తనని తెలుగు దేశం కార్యకర్తలు బూతు పదాలతో ఇష్టానుసారం తిట్టినందుకు చాలా కలతకు గురయ్యానని ఆవేదన చెందారు.