Begin typing your search above and press return to search.

థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. తెర‌వెనుక క‌థ‌

By:  Tupaki Desk   |   13 Dec 2016 7:30 PM GMT
థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. తెర‌వెనుక క‌థ‌
X
పృథ్వీ ఇప్పుడు తెలుగులో స్టార్ క‌మెడియ‌న్. అయిన‌ప్ప‌టికీ పృథ్వీ అనే పేరు మాత్ర‌మే ఉప‌యోగిస్తే వెంట‌నే జ‌నాలు గుర్తుప‌ట్ట‌కపోవ‌చ్చు. కానీ థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ అంటే మాత్రం ఎవ్వ‌రైనా గుర్తుప‌ట్టేస్తారు. ‘ఖ‌డ్గం’ సినిమాలో థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ అన్న డైలాగ్ అంత‌గా పాపుల‌ర్ అయింది మ‌రి. ఐతే ఈ పాత్ర త‌న‌కు కృష్ణ‌వంశీ ఇచ్చిన‌పుడు.. అది ఆ స్థాయిలో పేలుతుంద‌ని తాను అస్స‌లు ఊహించ‌లేదంటున్నాడు పృథ్వీ. ఐతే కృష్ణ‌వంశీనే త‌న‌కు కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆ పాత్ర చేయించిన‌ట్లు పృథ్వీ వెల్ల‌డించాడు. ఈ క్యారెక్ట‌ర్ వెనుక క‌థాక‌మామిషు ఏంటో పృథ్వీ మాట‌ల్లోనే తెలుసుకుందాం ప‌దండి.

‘‘ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో రావుగోపాల్రావు గారి మేనల్లుడి పాత్ర చేశాక బిజీ అయిపోతాన‌నుకున్నా. కానీ అలా జ‌ర‌గ‌లేదు. చిన్న చిత‌కా అవ‌కాశాలు వ‌చ్చినా అవి కెరీర్ కు పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. మ‌ధ్య‌లో మా అమ్మ చ‌నిపోవ‌డంతో డిప్రెష‌న్లోకి వెళ్లిపోయా. దాన్నుంచి తేరుకుని సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నం చేశా. కృష్ణ‌వంశీతో ప‌రిచ‌యం వ‌ల్ల ఆయ‌న సినిమాల్లో కొన్ని పాత్ర‌లు చేసినా స‌రైన బ్రేక్ రాలేదు. ఇలాంటి టైంలో నువ్వే నాకో దారి చూపించాలి అని కృష్ణ‌వంశీని చ‌నువుతో అడిగాను. ‘ఖ‌డ్గం’లో వేషం ఇచ్చాడు. ఐతే ఏదైనా సీరియ‌స్ క్యారెక్ట‌ర్ ఇస్తాడేమో అనుకుంటే డైలాగ్ చెప్ప‌డం చేత‌కాని న‌టుడి పాత్ర ఇచ్చాడు. దీని వ‌ల్ల ఏం పేరొస్తుందా అనుకుంటే.. సినిమా చూశాక అందరూ నా పాత్ర గురించే మాట్లాడుకుంటార‌ని కృష్ణ‌వంశీ ధైర్యం చెప్పాడు. అత‌ను అన్న‌ట్లే నా పాత్ర‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత నా జీవిత‌మే మారిపోయింది అని పృథ్వీ చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/