Begin typing your search above and press return to search.
సునీల్ కు త్రివిక్రమ్.. నాకు శ్రీధర్ సీపాన
By: Tupaki Desk | 14 Dec 2015 3:30 PM GMTకమెడియన్ గా సునీల్ నిలదొక్కుకోవడానికి త్రివిక్రమ్ ఎలా సాయం చేశాడో.. తనకు శ్రీధర్ సీపాన అలా తోడ్పాటు అందించాడని చెప్పాడు రైజింగ్ కమెడియన్ పృథ్వీ. ఒంగోలులో జరిగిన ‘సౌఖ్యం’ సినిమా ఆడియో ఫంక్షన్ కు హాజరైన అతడికి జనం బ్రహ్మరథం పట్టారు. హీరో గోపీచంద్ కు ఎలా రెస్పాండయ్యారో.. పృథ్వీకి కూడా అలాంటి స్పందనే వచ్చింది. ఈ సందర్భంగా పృథ్వీ ఏమన్నాడంటే..
‘‘ఈ ఫంక్షన్ కి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. వైజాగ్ లో షూటింగ్ లో పాల్గొంటున్నవాడిని ఈ వేడుకకు కచ్చితంగా హాజరు కావాలనుకున్నా. కానీ వైజాగ్ నుంచి ఫ్లైట్ లో రావడానికి అవకాశం లేకపోయింది. దీంతో రోడ్డు మార్గంలో 13 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చా. అసలీ వేడుకకు వస్తానో రానో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ అందుకోగలిగాను. ఇక్కడికి వచ్చాక కష్టమంతా ఎగిరిపోయింది.
ఆనంద్ ప్రసాద్ గారిది లక్కీ హ్యాండ్. ఆయన బేనర్లో చేసిన ‘లౌక్యం’ నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సినిమాలో నిజానికి క్లైమాక్స్ లో నా పాత్ర లేనే లేదు. కానీ హీరో - రచయితలు - దర్శకుడు - నిర్మాత అందరూ కలిసి నా పాత్ర అక్కడ ఉండాలని భావించి పొడిగించారు. శ్రీధర్ సీపాన నాకు దేవుడిచ్చిన తమ్ముడు. ఒకప్పడు ఎన్టీఆర్ కు పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన పాత్రలు రాశారు. త్రివిక్రమ్ సునీల్ కు సాయం చేశాడు. నాకు శ్రీధర్ అలాంటి పాత్రలు రాస్తున్నాడు’’ అని చెప్పాడు పృథ్వీ.