Begin typing your search above and press return to search.

మీ అమ్మగారు సరే 'మా'కు మీరేం ఇచ్చారు

By:  Tupaki Desk   |   8 March 2019 1:45 PM GMT
మీ అమ్మగారు సరే మాకు మీరేం ఇచ్చారు
X
సైలెంట్‌ గా జరగాల్సిన మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ ఎన్నికలను రచ్చకీడ్చారు. శివాజీ రాజా ప్యానల్‌ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం ఖాయంగా భావించిన సమయంలో అనూహ్యంగా సీనియర్‌ నటుడు నరేష్‌, జీవిత రాజశేఖర్‌ లు తెరపైకి వచ్చి ఎన్నికలను రసవత్తరంగా మార్చారు. ఎన్నికల్లో ప్రచారం నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలు పెట్టారు. శివాజీ రాజాను వ్యక్తిగతంగా విమర్శించడంతో ఎన్నికలు మరింతగా రసవత్తరంగా మారాయి. రెండు ప్యానల్స్‌ కూడా మీడియా సమావేశాలు పెట్టడం, మీడియా ఛానెల్స్‌ లో డిబెట్‌ లకు వెళ్లడం చేస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు మొత్తం ఈ ఎన్నికలపై ఆసక్తిని కనబర్చుతున్నాయి.

తాజాగా శివాజీ రాజా ప్యానెల్‌ తరపున పోటీ చేస్తున్న పృథ్వీ మీడియా సమావేశంలో సీనియర్‌ నటుడు నరేష్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. మా కుటుంబంలో జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రాలు మొత్తం చూసేలా చేశారు. టీవీ కార్యక్రమాల్లో చర్చలకు వెళ్లడం ఎందుకు, మీడియా సమావేశాలు నిర్వహించడం ఎందుకు అంటూ ప్రశ్నించాడు. నరేష్‌ గారు ఒక్క ఛాన్స్‌ ఇస్తే మంచి చేస్తానంటూ ప్రచారం చేస్తున్నారు. మరి మొన్నటి వరకు ప్రెసిడెంట్‌ కంటే పవర్‌ ఫుల్‌ పొజీషన్‌ అయిన జనరల్‌ సెక్రటరీ పదవిలోనే ఉన్నారు. మరి ఇన్నాళ్లు ఎందుకు చేయలేదు అంటూ పృథ్వీ ప్రశ్నించారు.

ప్రతి మీడియా సమావేశంలో కూడా మా అమ్మ గారు మా కు అంత సాయం చేశారు, ఇంత సాయం చేశారు అంటూ ప్రచారం చేస్తున్నారు. మీ అమ్మగారు మా కు చేసిన సాయం అందరికి తెలిసిందే. ఆమె ఇప్పుడు కాదు ఎప్పటి నుండో మాకు సాయం అందిస్తూనే ఉన్నారు. ఆమె విషయం పక్కన పెడితే మీరు మా కోసం చేసింది ఏంటో చెప్పండి అంటూ పృథ్వీ ఎద్దేవ చేశాడు. ఫండ్‌ రైజింగ్‌ కోసం జరిగిన కార్యక్రమం విషయంలో అన్ని విషయాలు, లెక్కలు క్లీయర్‌ గా ఉన్నాయని స్వయంగా చిరంజీవి గారు చెప్పారు.

అమెరికా పోగ్రాం కాంట్రాక్టర్‌ ఎక్కువ లాభాలు దక్కించుకుంటే మా ను నిధించడం ఎందుకు, అసలు అన్ని విషయాలను మీడియా వరకు తీసుకు రావాల్సిన అవసరం ఏంటీ, మాలో ఉన్న పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్తే సరిపోతుంది కదా. నాకు అన్ని విధాలుగా శివాజీ రాజా గారు, నరేష్‌ గారు తెలుసు. వారిపై నాకు పూర్తి నమ్మకం ఉంది అందుకే వారికి మద్దతు ఇస్తున్నాను. ఈనెల 10వ తేదీన జరుగబోతున్న మా ఎన్నికల్లో న్యాయం గెలుస్తుంది, శివాజీ రాజా ప్యానల్‌ గెలుస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు.