Begin typing your search above and press return to search.
హీరోకు నెగటివ్.. వారికి పాజిటివ్
By: Tupaki Desk | 12 Jun 2020 9:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి వైరస్ విజృంభిస్తున్న సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు పూర్తిగా కొన్ని రోజుల పాటు మూత పడ్డాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ విమాన రాకపోకలు జరుగుతున్నాయి. మలయాళ చిత్రం ఆడుజీవితం యూనిట్ సభ్యులు జోర్డన్ లో షూటింగ్ కోసం వెళ్లి అక్కడ దాదాపుగా రెండు నెలల పాటు చిక్కుకున్న వారు ఎట్టకేలకు ఇండియా తిరిగి వచ్చారు.
కేరళలో దిగిన వారు ఎవరి ఇంటికి వారు వెళ్లి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇటీవలే హీరో పృధ్వీరాజ్ మరియు చిత్ర యూనిట్ సభ్యులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 50 మంది యూనిట్ సభ్యులు జోర్డన్ కు వెళ్లగా అక్కడకు వెళ్లిన వారిలో 48 మందికి పరీక్ష నెగటివ్ రాగా ఇద్దరికి మాత్రం పాజిటివ్ వచ్చిందట.
హీరోకు నెగటివ్ రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాని ప్రొడక్షన్ టీంకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి ఒకరు మరియు మద్య వయసున్న వ్యక్తి మరొకరు ఈ వైరస్ బారిన పడ్డట్లుగా మలయాళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఆందోళన అక్కర్లేదని ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. త్వరలోనే వారు రికవరీ అవుతారనే నమ్మకంతో ఉన్నామని ఆడు జీవితం యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.