Begin typing your search above and press return to search.
బత్తాకాయల బాబ్జీ.. బూతో హరి!!!
By: Tupaki Desk | 14 July 2016 6:58 AM GMTఇప్పుడు టాప్ గేర్ లో ఉన్న టాలీవుడ్ కమెడియన్ పేరు చెప్పమంటే.. టక్కుమని పృథ్వీ అనాల్సిందే. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్న పృథ్వీకి ఇప్పుడు టైమ్ వచ్చింది. ఈ కమెడియన్ కోసం స్పెషల్ గా కేరక్టర్లు డిజైన్ చేస్తున్నారు.. ప్రత్యేకంగా డైలాగులు రాయిస్తున్నారు డైరెక్టర్లు. పంచ్ లు - మాడ్యులేషన్ తోనే కాదు.. కేరక్టర్ పేర్లతో కూడా తెగ ఆకట్టుకుంటున్నాడు.
సెల్ఫీ రాజా కోసం పృథ్వీ చెప్పిన ఓ పంచ్ బాగా పేలింది. అల్లు అర్జున్ చెప్పిన 'చెప్పను బ్రదర్' ను పంచ్ డైలాగ్ గా భలే పేల్చాడు పృథ్వీ. ఇప్పుడీ పృథ్వీకి వెంకీ-మారుతి మూవీ బాబు బంగారంలో ఓ మాంచి కేరక్టర్ దక్కిందంటున్నారు. ఆ పాత్ర పేరు 'బత్తాకాయల బాబ్జీ'. గతంలో అమ్మ నా బత్తాయో అనే డైలాగ్ ని చెప్పి పృథ్వీ మెప్పించాడు. ఆ ఇన్ స్పిరేషన్ తోనే ఇలాంటి టైటిల్ పెట్టారని అనుకోవచ్చు కానీ.. మరీ బూతు వింటున్నట్లుగా ఉందనే కామెంట్స్ పడుతున్నాయి.
మారుతి సినిమాలో ఇలాంటి బూతులు వినిపించడం వింతేమీ కాదు కానీ.. వెంకటేష్ మూవీలో బత్తాకాయల బాబ్జీ అనే పేరుతో కామెడీ చేయించాడంటే.. నిజంగానే మారుతిని పొగడాల్సిందే. బాబు బంగారం లో ఫస్టాఫ్ అంతా పృథ్వీ చెలరేగిపోతాడని.. మళ్లీ క్లైమాక్స్ లో వచ్చి కుమ్మేస్తాడని తెలుస్తోంది.